• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAVITEJA KHILADI TO STREAM ON AMAZON PRIME HERE ARE THE DETAILS SR

Raviteja : అమెజాన్ ప్రైమ్‌లో రవితేజ ఖిలాడి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Raviteja : అమెజాన్ ప్రైమ్‌లో రవితేజ ఖిలాడి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Raviteja Khiladi Photo : Twitter

Raviteja : మాస్ మహారాజా రవితేజ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత ఖిలాడి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    Raviteja : మాస్ మహారాజా రవితేజ క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత ఖిలాడి అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు ఓటీటీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. రవితేజ సినిమా ఖిలాడి ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయ్యిందని సమాచారం. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమేజాన్‌ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని దక్కించుకుంది. అమెజాన్ దాదాపు 6 కోట్లపైగా ధర చెల్లించి ఈసినిమా డిజిటల్ రైట్స్‌ను కొన్నట్లు టాక్. ఇక్కడ కండీషన్ ఏమంటే ఈ సినిమా ముందుగా థియేటర్లలోనే విడుదల అవుతుంది. ఆ తరవాతే ఓటీటీకిలో స్ట్రీమ్ అవుతుంది. అంటే పోస్ట్ థియేటర్ రన్ తర్వాత ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఇక ఈ సినిమా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో విడుదల కావాల్సింది. కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. థియేటర్లు మళ్లీ తెరచుకుంటే.. ముందుకొచ్చే సినిమాల్లో ఖిలాడి ముందు వరుసలో ఉండనుంది.

    ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓ టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. ఇక ఇదే కాంబినేషన్’లో రవితేజ హీరోగా 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా ఓ పాత్రలో మెరవనుంది.

    Anasuya Bharadwaj news, Anasuya Bharadwaj hot,Anasuya Bharadwaj fb,Anasuya Bharadwaj facebook,Anasuya Bharadwaj insta,Anasuya Bharadwaj instagram,Anasuya Bharadwaj twitter,Anasuya Bharadwaj age,Anasuya Bharadwaj size,Anasuya Bharadwaj,anasuya bharadwaj,anchor anasuya,anasuya,anasuya hot,anasuya hot photos,anchor anasuya bharadwaj,anasuya bharadwaj husband,anasuya bharadwaj dance,anasuya bharadwaj hot navel,anchor anasuya,jabardasth anchor anasuya,anasuya hot,అనసూయ,అనసూయ పుట్టినరోజు,అనసూయ పుట్టినరోజు ఫోటోస్,అనసూయ ఫోటోస్,అనసూయ హాట్ ఫోటోస్,అనసూయ టాటూస్
    Anasuya Bharadwaj instagram


    ఇక ఈ సినిమా ఇలా ఉండగానే రవితేజ మరోసినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. నక్కిన త్రినాధ్ రావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందట. కాగా మొదటి హీరోయిన్’గా రవితేజ సరసన రాశీఖన్నా నటించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో హిరోయిన్‌గా ప్రియాంక ఆరుళ్ మోహన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసిందట చిత్రబృందం. ప్రియాంక గతంలో నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత రవితేజ శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో మరో సినిమాను ఓకే చేశారు.
    Published by:Suresh Rachamalla
    First published: