• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • RAVITEJA KHILADI TO RELEASE ONLY IN THEATERS NO AMAZON PRIME RELEASE HERE ARE THE DETAILS SR

Raviteja : అమెజాన్ ప్రైమ్‌లో ఖిలాడి విడుదల కానుందా.. చిత్రబృందం క్లారిటీ..

Raviteja : అమెజాన్ ప్రైమ్‌లో ఖిలాడి విడుదల కానుందా.. చిత్రబృందం క్లారిటీ..

Raviteja Khiladi Photo : Twitter

Raviteja : మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో వస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రాన్ని రాక్షసుడు ఫేమ్ దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు.

  • Share this:
    Raviteja : మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో వస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రాన్ని రాక్షసుడు ఫేమ్ దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఈ నెలలో విడుదల కావలసి ఉంది. అయితే కరోనా వలన ఈ సినిమా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఓటీటీ డీల్ కుదిరినట్టు.. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని ఆరు కోట్లకు పైగా ధర చెల్లించి డిజిటల్ రైట్స్ దక్కించుకుందని వార్తలు రాగా.. ఈ విషయంపై చిత్రబృదం స్పందించింది. ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయట్లేదని.. కేవలం ఈ సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయనున్నామని తెలిపింది. అందులో భాగంగా మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేసారు. ఇక క్రాక్ లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఈ సినిమా రావడంతో ఖిలాడిపై మంచి అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఓ టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ నిర్మిస్తోంది.

    ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ వర్మ గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. ఇక ఇదే కాంబినేషన్’లో రవితేజ హీరోగా 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ కూడా ఓ పాత్రలో మెరవనుంది.


    ఇక ఈ సినిమా ఇలా ఉండగానే రవితేజ మరోసినిమాకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. నక్కిన త్రినాధ్ రావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు అవకాశం ఉందట. కాగా మొదటి హీరోయిన్’గా రవితేజ సరసన రాశీఖన్నా నటించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో హిరోయిన్‌గా ప్రియాంక ఆరుళ్ మోహన్ ను హీరోయిన్ గా ఫైనల్ చేసిందట చిత్రబృందం. ప్రియాంక గతంలో నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత రవితేజ శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో మరో సినిమాను ఓకే చేశారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు పనులను జరుపుకుంటోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    అగ్ర కథనాలు