హోమ్ /వార్తలు /సినిమా /

సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’

సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’

అమర్ అక్బర్ ఆంటోని యూ/ఏ సర్టిఫికేట్

అమర్ అక్బర్ ఆంటోని యూ/ఏ సర్టిఫికేట్

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’  మూవీ ఈ నెల 16న విడుదల కానుంది.తాజాగా ఈ మూవీకి సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసారు.

ఈ యేడాది రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి  చూడు’, ‘నేల టిక్కెట్టు’  సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ మూవీల తర్వాత రవితేజ...గతంలో తనకు మూడు సక్సెస్‌లు అందించిన శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమా చేసాడు.

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’  మూవీ ఈ నెల 16న విడుదల కానుంది. ఈ మూవీతో ఇలియానా టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడులైన ఈ మూవీ టీజర్‌, ట్రైలర్, పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

అమర్ అక్బర్ ఆంటోనీ

తాజాగా ఈ మూవీకి సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు.

గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ, శ్రీనువైట్లకు ఈ మూవీ సక్సెస్ అనేది కీలకం. మరి ఈ మూవీతో రవితేజకు మంచి సక్సెస్ ఇచ్చి దర్శకుడిగా శ్రీనువైట్ల టాలీవుడ్‌లో తన సత్తా చూపెడతాడా లేదా అనేది వెయిట్ అండ్ సీ.

First published:

Tags: Ravi Teja, Tollywood

ఉత్తమ కథలు