Ravi Teja: న‌ట వార‌సుడిపై మాస్ మ‌హారాజా ర‌వితేజ కామెంట్స్

Raviteja has given clarity on his son entry into movies

Ravi Teja - Mahadhan: రవితేజ తనయుడు మహాధన్ సినీ రంగ ప్రవేశం గురించి వినిపిస్తోన్న వార్తలపై రీసెంట్ ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చేశాడు.

  • Share this:
    సినీ రంగంలో న‌ట వార‌సుల‌కు కొద‌వే లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి నిల‌దొక్కుకున్న వారు చాలా త‌క్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో మాస్‌రాజా ర‌వితేజ ఒక‌రు. ఇప్పుడు ఈయ‌న కూడా అంద‌రిలాగానే త‌న న‌ట వార‌సుడిని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేస్తాడా? అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే విష‌యాన్ని ర‌వితేజ‌ను ప్ర‌శ్నిస్తే.. ఇప్ప‌ట్లో త‌న కుమారుడు మ‌హాధ‌న్ ఎంట్రీ ఉండ‌ద‌ని క్లారిటీ చేసేశాడు. ఎందుకంటే త‌ను ప్ర‌స్తుతం తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్నాడ‌ని, చ‌దువు త‌ప్ప మ‌రో ధ్యాస లేద‌ని ర‌వితేజ చెప్పేశాడు.

    అయితే రాజాదిగ్రేట్ చిత్రంలో ర‌వితేజ చిన్న‌ప్ప‌టి పాత్ర‌లో మ‌హాధ‌న్ న‌టించాడుగా అని అడిగితే, అప్పుడు డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి బ‌ల‌వంతం మీద న‌టింప చేయాల్సి వ‌చ్చింది. అంతే కానీ.. మ‌హాధ‌న్ సినిమాల కోసం ఉన్న చ‌దువు వ‌దిలేయ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని ర‌వ‌తేజ తేల్చి చెప్పేశాడు. దీంతో ర‌వితేజ త‌న‌యుడు మ‌హాధ‌న్ సినీ రంగ ప్ర‌వేశం వ‌స్తున్న వార్త‌ల‌కు ర‌వితేజ చెక్ పెట్టేసిన‌ట్ల‌య్యింది.

    raviteja, mass maharaja raviteja, krack, raviteja latest movie krack, raviteja clarity on his son, mahadhan, mahadhan entry into movies, tollywood news, రవితేజ, క్రాక్ మూవీ, రవితేజ క్రాక్ చిత్రం, రవితేజ తనయుడు మహాధన్
    Raviteja has given clarity on his son entry into movies


    మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమా జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది. సినిమాలు రీ ఓపెన్ అయిన త‌ర్వాత విడుద‌ల‌వుతున్న తొలి స్టార్ చిత్రం కూడా ఇదే. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టించింది. రవితేజ‌తో డాన్‌శీను, బ‌లుపు చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని ఈ సినిమాను తెర‌కెక్కించాడు.
    Published by:Anil
    First published: