గత కొన్నేళ్లుగా రవితేజ నుంచి వరుస ఫ్లాపులు వస్తున్న హీరోగా మాస్ రాజా జోరు మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే వరుస సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు. వరుసగా "టచ్ చేసి చూడు".. "నేలటికెట్".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాలతో వచ్చాడు మాస్ రాజా. "రాజా ది గ్రేట్"తో రెండేళ్ల తర్వాత వచ్చి హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ తర్వాత మాత్రం అదే టెంపో కొనసాగించలేకపోయాడు. ఈయన సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఇక ఇప్పుడు వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేసాడు. రవితేజ పుట్టినరోజు రిపబ్లిక్ డే కానుకగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రూ. 2.54 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఒక రకంగా చూసుకుంటే రవితేజ కెరీర్లోనే అత్యంత తక్కువ వసూలు చేసినట్టు సమాచారం.
ఓవర్సీస్, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా కలిపి కేవలం రూ. 66 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా రూ. 3.2 కోట్లు వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రూ. 20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా.. బ్రేక్ ఈవెన్ కావాలంటే దాదాపు రూ. 16.5 కోట్ల వరకు వసూలు చేయాలి. మొత్తంగా ‘డిస్కోరాజా’ టాక్ చూస్తుంటే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అంటున్నారు. మొత్తంగా ఈ రోజు, ఆదివారం తర్వాత ఈ సినిమా పరిస్థితి ఏంటనే అంచనాకు రావచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Box Office Collections, Disco Raja, Payal Rajput, Raviteja, Telugu Cinema, Tollywood