హోమ్ /వార్తలు /సినిమా /

మహేష్ బాబు స్టోరీతో.. రవితేజ కొత్త సినిమా..

మహేష్ బాబు స్టోరీతో.. రవితేజ కొత్త సినిమా..

రవితేజ, మహేష్

రవితేజ, మహేష్

రవితేజ ఏంటి మహేష్ కథతో సినిమా చేయడం ఏంటి అనుకుంటున్నారా..!.ఏమి లేదు. ‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి  చూడు’, ‘నేల టిక్కెట్టు’  ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. దీంతో ఇపుడు చేయబోయే ఈ మూవీ మహేష్ ఫ్లాప్ సినిమాకు కాపీ అని చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

రవితేజ ఏంటి మహేష్ కథతో సినిమా చేయడం ఏంటి అనుకుంటున్నారా..!.ఏమి లేదు. ‘రాజా ది గ్రేట్’ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘టచ్ చేసి  చూడు’, ‘నేల టిక్కెట్టు’  ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలు ఒక దాన్ని మించి ఇంకొకటి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.వరసగా హాట్రిక్ ఫ్లాప్స్‌తో ఈ సినిమాలను కొన్న బయ్యర్స్ నిండా మునిగిపోయారు. దీంతో చేయబోయే నెక్ట్ ప్రాజెక్ట్ విషయంలో రవితేజ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు.


వరుసగా హాట్రిక్ ఫ్లాపుల తర్వాత రవితేజ వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ  సినిమాను కూడా వీఐ ఆనంద్ తన గత చిత్రాల మాదిరే థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.


ఈ సినిమాలో రవితేజ వృద్దుడిగా కనిపిస్తాడట. ఆ తర్వాత తన శతృవులపై రివేంజ్ తీర్చుకోవడం కోసం యువకుడిగా మారిపోతాడట. వృద్దుడిగా ఉన్న మాస్ రాజా..ఎలా యువకుడిగా మారాడనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. గతంలో ఎస్.జే.సూర్య దర్శకత్వంలో మహేష్ హీరోగా నటించిన ‘నాని’ సినిమాకు కాపీలా కనబడుతోంది. ఆ సినిమాలో మహేష్  పగలు చిన్నాపిల్లాడిలా..రాత్రి పెద్దవాడిలా మారిపోతాడు.


అదే కాన్సెప్ట్‌ను కొంచెం ఛేంజ్ చేసి వృధ్దుడిగా ఉండే రవితేజ..ఆ తర్వాత తనకు అన్యాయం చేసిన వాళ్లపై యువకుడిగా మారి రివేంజ్ తీసుకుంటాడు. మొత్తానికి డిఫరెంట్ కాన్సెప్ట్ అంటూ వీఐ ఆనంద్ ...ఆల్రెడీ హాలీవుడ్‌లో హిట్టైన స్టోరీనీ..ఎస్.జె.సూర్య కాపీ కొట్టి సినిమా తీశాడు. అపుడే అదే కాన్సెప్ట్‌ను రవితేజ కోసం తాజాగా వండి వారుస్తున్నాడు వీఐ ఆనంద్. అంతేకాదు ‘డిస్కోరాజా’ టైటిల్‌లో సీతాకోక చిలుకను చూపించినట్టు రవితేజ..అతడి జీవితంలో వివిధ దశలను ఈ సినిమాలో చూపించే అవకాశాలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. మొత్తానికి మహేష్‌కు వర్కౌట్ కానీ కాన్సెప్ట్ వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజకు వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి.

డబూ రత్నానీ క్యాలెండర్ ఫోటోషూట్ 2019..
ఇవి కూడా చదవండి 


హైప‌ర్ ఆది ప్ర‌యోగం బెడిసికొట్టిందా.. సినిమాల్లో సీన్ రివ‌ర్స్..


బిగ్ బాస్ 3 హోస్ట్ ఎవ‌రు.. జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా..?


‘ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు’ మ‌రోసారి వాయిదా ప‌డ‌బోతుందా..?

First published:

Tags: Mahesh babu, Raviteja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు