Home /News /movies /

RAVITEJA BROTHER RAGHU SON MADHAV BHUPATHIRAJU CINE ENTRY WITH EY PILLA SLB

మాస్ మహారాజా రవితేజ ఫ్యామిలీ మెంబర్ సినీ ఎంట్రీ.. 'ఏయ్.. పిల్లా' అంటూ యువ హీరో ఆగమనం

Ey Pilla Photo Twitter

Ey Pilla Photo Twitter

ey Pilla Poster: స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నటీనటులతో పాటు దర్శకనిర్మాతల వారసులు సినీ ఎంట్రీ ఇస్తుంటారు. ఈ క్రమంలోనే 'ఏయ్.. పిల్లా' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు.

ఇంకా చదవండి ...
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది కామన్. స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న నటీనటులతో పాటు దర్శకనిర్మాతల వారసులు సినీ ఎంట్రీ ఇస్తుంటారు. వారి వారి వారసులే కాకుండా కుటుంబ సభ్యులు కూడా సినీ గడప తొక్కుతుండటం చూస్తుంటాం. ఈ క్రమంలోనే 'ఏయ్.. పిల్లా' అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) సోదరుడు రఘు (Raghu) కుమారుడు మాధవ్ భూపతిరాజు (Madhav Bhupathiraju). ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు మేకర్స్.

మాస్ మహారాజా రవితేజ సోదరుడు, కొన్ని చిత్రాల్లో హీరోగా, ఆర్టిస్టుగా నటించిన రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజును హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఓ సినిమా నిర్మిస్తున్నారు. భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా ఈ మూవీ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఏయ్.. పిల్లా' అనే టైటిల్ ఖరారు చేసి కొత్త పోస్టర్ వదిలారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా యూత్ లో క్రేజ్ అందుకోవచ్చు అని తెలుస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ.. ''హృదయానికి హత్తుకునే ఓ అందమైన ప్రేమకథా చిత్రమిది. థియేటర్లలో ప్రేక్షకులకు చక్కటి అనుభూతి ఇస్తుంది. వింటేజ్ ప్రేమకథగా 90ల నేపథ్యంలో రూపొందిస్తున్నాం. సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభించాలని సన్నాహాలు చేస్తున్నాం. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెల్లడిస్తాం'' అని అన్నారు.

'ఏయ్... పిల్లా' చిత్రంలో మాధవ్ భూపతిరాజు సరసన మిస్ ఇండియా ఫస్ట్ రన్నరప్ రూబల్ షికావత్ నటిస్తున్నారు. కథానాయికగా ఆమెకు తొలి చిత్రమిది. ప్రముఖ దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రానికి కథ అందిస్తుండటం విశేషం. లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మాధవ్ భూపతిరాజుకు ఈ సినిమా గ్రాండ్ ఎంట్రీ కావాలనే కోణంలో సన్నాహాలు చేస్తున్నారట.
Published by:Sunil Boddula
First published:

Tags: Ravi Teja, Tolllywood, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు