హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ సినిమాలో రవితేజ.. ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు..

బాలకృష్ణ సినిమాలో రవితేజ.. ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు..

బాలకృష్ణ, రవితేజ

బాలకృష్ణ, రవితేజ

అవును బాలకృష్ణ సినిమాలో రవితేజ నటించబోతున్నాడు. నిజంగానే రవితేజ బాలయ్య హీరోగా నటిస్తోన్నసినిమాలో మరో హీరోగా యాక్ట్ చేస్తున్నాడా.. లేకపోతే వీళ్లిద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి కదా. వివరాల్లోకి వెళితే..

ఇంకా చదవండి ...

  అవును బాలకృష్ణ సినిమాలో రవితేజ నటించబోతున్నాడు. నిజంగానే రవితేజ బాలయ్య హీరోగా నటిస్తోన్నసినిమాలో మరో హీరోగా యాక్ట్ చేస్తున్నాడా.. లేకపోతే వీళ్లిద్దరు కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి కదా. కానీ రవితేజ మాత్రం..బాలయ్య వద్దనుకున్న స్టోరీలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.


  ఎన్టీఆర్ బయోపిక్ సెట్స్‌పై ఉండగానే.. బాలయ్య వివి వినాయక్‌తో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. కానీ బాలకృష్ణ మాత్రం ..వినాయక్‌ను పక్కనపెట్టి మరి బోయపాటి శ్రీనుతో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు. తొందర్లనే  ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.


  మరోవైపు వి.వి.వినాయక్..బాలకృష్ణ కోసం రెడీ చేసుకున్న కథను రవితేజతో చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రవితేజ పరిస్థితి ఎటూ కాకుండా ఉంది. వరుస ఫ్లాపులతో రేసులో చాలా వెనకబడ్డాడు. ప్రస్తుతం వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం తన పారితోషకాన్ని సగానికి సగం తగ్గించుకున్నాడు మాస్ రాజా.


  ఈ సినిమా తర్వాత మరో సినిమా లేని రవితేజ..గత్యంతరం లేని పరిస్థితుల్లో వినాయక్‌ చెప్పిన కథకు ఓకె చెప్పినట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘కృష్ణ’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ఇపుడు మరోసారి ఈ సినిమా కోసం కలసి పనిచేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించే అవకాశాలున్నాయి.

  First published:

  Tags: Balakrishna, Raviteja, Telugu Cinema, Tollywood, VV Vinayak

  ఉత్తమ కథలు