హోమ్ /వార్తలు /సినిమా /

సీరియల్ నటిని పెళ్లాడిన నిర్మాత.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్! ఇదీ మ్యాటర్

సీరియల్ నటిని పెళ్లాడిన నిర్మాత.. ట్రెండ్ అవుతున్న ఫొటోస్! ఇదీ మ్యాటర్

Mahalakshmi ravindar (Photo Twitter)

Mahalakshmi ravindar (Photo Twitter)

serial actress Mahalakshmi: ఓ తమిళ జంట వివాహం తాలూకు విషయాలు, ఆ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జోడీని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సినీ, సీరియల్ నటీనటుల ప్రేమ సంగతులు.. పెళ్లి వ్యవహారాలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సెలబ్రిటీ పెళ్లి అంటే ఆ పెళ్ళికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు జనం. అదే సెలబ్రిటీ జోడీ ఒక్కటైతే ఆ ట్రెండ్ వేరేలా ఉంటుంది. తాజాగా అదే జరుగుతోంది. ఓ తమిళ జంట వివాహం తాలూకు విషయాలు, ఆ పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జోడీని చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఎవరా జోడీ? వివరాలేంటి అనేది ఇప్పుడు చూద్దాం..

ఓ నిర్మాత ఓ నటి పెళ్లి చేసుకున్నాడు. ఇది కామనే మరి ఇందులో కొత్తగా ఏముంది? అనే కదా అనుకుంటున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇది ఇద్దరికీ కూడా రెండో పెళ్లి. ఇది వరకే వీళ్లిద్దరికీ పెళ్లిళ్లు జరిగి.. కొన్ని వ్యక్తిగత కారణాలతో వారి వారి భాగస్వామ్యులతో విడిపోయారు. మళ్లీ ఇప్పుడు ఇలా పెళ్లి బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.

సీరియల్ నటి, వీజే మహాలక్ష్మీ (serial actress Mahalakshmi).. తమిళ నిర్మాత అయిన రవిందర్ చంద్రశేఖర్ (Ravindar Chandrasekaran) ని పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి తిరుపతి వేదికైంది. తిరుపతిలో నిన్న ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. ఇవి చూసిన జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రవిందర్ చంద్రశేఖర్ నిర్మిస్తున్న రెండు సినిమాల్లో మహాలక్ష్మీ నటిస్తోందట. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి పెళ్లి దాకా వెళ్లారని టాక్. బుల్లితెరపై సీరియల్స్‌తో మహాలక్ష్మీ అందరినీ మెప్పించిన సంగతి తెలిసిందే. వాణి రాణి వంటి సీరియళ్లలో మహాలక్ష్మీ పోషించిన పాత్రకు మంచి స్పందన లభించింది. అయితే ఇప్పుడు ఆమె నిర్మాతను పెళ్లాడటం తమిళనాట హాట్ టాపిక్ అయింది. వీళ్లిద్దరి పెళ్లి ఫొటోస్ చూసి నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్ల రూపంలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పెళ్లి ఫొటోస్ ఆన్ లైన్ మాధ్యమాలపై ట్రెండ్ అవుతుండటం ఇక్కడ అసలు పాయింట్.

Published by:Sunil Boddula
First published:

Tags: Kollywood, Kollywood Cinema, Tollywood actress

ఉత్తమ కథలు