Aaviri:‘ఆవిరి’ టీజర్ విడుదల.. మరోసారి భయపెడుతున్న రవిబాబు..

Aaviri Movie Teaser Talk | రీసెంట్‌గా ‘అదుగో’ అంటూ పంది పిల్లతో ఒక ప్రయోగాత్మక చిత్రం చేసిన రవిబాబు.. తాజాగా ‘ఆవిరి’ అనే హార్రర్ నేపథ్య చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసారు.

news18-telugu
Updated: September 28, 2019, 7:14 PM IST
Aaviri:‘ఆవిరి’ టీజర్ విడుదల.. మరోసారి భయపెడుతున్న రవిబాబు..
రవిబాబు ‘ఆవిరి’ మూవీ ఫస్ట్ లుక్ (Twitter/Photo)
  • Share this:
Aaviri | రీసెంట్‌గా ‘అదుగో’ అంటూ పంది పిల్లతో ఒక ప్రయోగాత్మక చిత్రం చేసిన రవిబాబు.. తాజాగా ‘ఆవిరి’ అనే హార్రర్ నేపథ్య చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్‌లో రాజ్ కుమార్ రావ్ అండ్ ఫ్యామిలీ ఒక ఇంట్లో ఉంటారు. వీళ్లతో పాటు ఆ ఇంట్లో ఒక ఆత్మ ఉంటుంది. దీంతో ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసారనేది ఈ సినిమా టీజర్‌లో చూపెట్టారు. ‘అవును’ తర్వాత రవిబాబు మరోసారి హార్రర్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో ఆవిరికి, ఇంట్లో ఉన్న ఆత్మకు ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.


‘ఆవిరి’ సినిమాను రవిబాబు డైరెక్ట్ చేయడమే కాకుండా తాను కూడా ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. ఇతర పాత్రల్లో నేహా చౌహాన్,శ్రీముక్త, భరణి శంకర్,ముఖ్తార్ ఖాన్ నటించారు. ఈ సినిమాను ఫ్లైయింగ్ ఫ్రాగ్స్ పతాకంపై రవిబాబు నిర్మించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు  ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేయనున్నట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ప్రకటించారు. డేట్ మాత్రం ప్రకటించలేదు. మరి ‘ఆవిరి’ సినిమాతో రవిబాబు మరోసారి టాలీవుడ్‌లో తన మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.

First published: September 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు