ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడమనేది ఎప్పటి నుంచో ఉంది. గత కొన్నేళ్లుగా అన్ని ఇండస్ట్రీస్‌లో కథల కొరత చాలా ఉంది. అందుకే ఏదైనా ఒక భాషలో సినిమా హిట్టైయితే వెంటనే వేరే భాషల వాళ్లు ఆయ సినిమాలను రీమేక్ చేస్తున్నారు. అంతేకాదు ఈ రీమేక్‌లు సూపర్ హిట్ అవ్వడమే కాదు..నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా రవితేజ తమిళంలో హిట్టైన ‘విక్రమ్ వేద’ను తెలుగులో రీమేక్ చేయనున్నట్టు సమాచారం. ఈ రీమేక్‌ను సుధీర్ వర్మ డైరెక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రవితేజ.. పోలీస్ ఆఫీసర్ విక్రమ్ పాత్రలో నటించనున్నాడు. మరోవైపు గ్యాంగ్ స్టర్ వేద పాత్ర కోసం మెగా హీరో వరుణ్ తేజ్‌ను అనుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ‘వాల్మీకి’ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన వరుణ్ తేజ్.. మరోసారి ‘గ్యాంగ్ స్టర్’ పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం. ఒకవేళ వరుణ్ తేజ్ కాకపోతే.. రానా నటించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
గతంలో ఈ తెలుగు రీమేక్ కోసం పలువురు హీరోలు పేర్లు వినిపించినా..ఫైనల్‌గా ‘విక్రమ్ వేద’ తెలుగు రీమేక్‌లో ఒక హీరోగా రవితేజ పేరు దాదాపు ఖరారైంది. మరో హీరో ఎవరనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Madhavan, Rana, Ravi Teja, Tamil Cinema, Telugu Cinema, Tollywood, Varun Tej, Vijay Sethupathi