హోమ్ /వార్తలు /సినిమా /

అల్లు అర్జున్ దర్శకుడితో రవితేజ క్రేజీ ప్రాజెక్ట్..

అల్లు అర్జున్ దర్శకుడితో రవితేజ క్రేజీ ప్రాజెక్ట్..

అల్లు అర్జున్, రవితేజ (Twitter/Photo)

అల్లు అర్జున్, రవితేజ (Twitter/Photo)

ప్రస్తుతం రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఐనా.. సూపర్ హిట్ దర్శకుల వెంట పడకుండా.. ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకులతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు.తాజాగా ఈయన అల్లు అర్జున్ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు.

  ప్రస్తుతం రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. ఐనా.. సూపర్ హిట్ దర్శకుల వెంట పడకుండా.. ఫ్లాప్స్ ఇచ్చిన దర్శకులతోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అందులో రాక్షసుడు సినిమా దర్శకుడు రమేష్ వర్మ మినహాయిస్తే.. అందరు ఫ్లాప్ దర్శకులతో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రవితేజ..  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా చేస్తున్నాడు ఈయన. గోపీ గత సినిమా విన్నర్ విడుదలై మూడేళ్లు దాటింది. ఈ సినిమా ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. ఈ యేడాది వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కోరాజా’ సినిమా చేసాడు. గతంలో ఈయన ’ఒక్క క్షణం’ వంటి ఫ్లాప్ సినిమా ఇచ్చాడు. ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చినా.. ఎందుకో నడవలేదు. తాజాగా రవితేజ.. వక్కంతం వంశీ డైరెక్షన్‌లో నెక్ట్స్ మూవీ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. రెండేళ్ల క్రితం ఈయన అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది.

  ravi teja to work with allu arjun director vakkantham vamsi here are the details,ravi teja,vakkantham vamsi,ravi teja vakkantham vamsi,ravi teja vakkantham vamsi movie,ravi teja twitter,ravi teja movies,vakkantham vamsi,vakkantham vamsi twitter,vakkantham vamsi movies,ravi teja vakkantham vamsi kick movie,ravi teja vakantham vamsi movie updates,ravi teja touch chesi chudu,vakkantham vamsi movie with ravi teja,vakkantham vamsi script for ravi terja,vakkantham vamsi next movie,ravi teja crack movie,రవితేజ,రవితేజ క్రాక్,రవితేజ వక్కంతం వంశీ,రవితేజ వక్కంతం వంశీ,రవితేజ వక్కంతం వంశీ
  రవితేజ వక్కంతం వంశీ సినిమా (ravi teja vakkantam vamsi)

  తాజాగా ఈయన రవితేజను కలిసి ఓ లైన్‌ను వినిపించాడట. దానికి రవితేజ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో ఈయన రవితేజ‌ నటించిన  కిక్ సినిమాకు కథను అందించాడు. ఇపుడు అదే టైపులో మరో పవర్‌ఫుల్ కథను రవితేజ ఇమేజ్ తగ్గట్టు రెడీ చేసినట్టు సమాచారం. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడట.రవితేజతో చేసే సినిమాతోనైనా హిట్టు కొట్టాలనే కసితో ఉన్నాడు వక్కంతం వంశీ.  ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న క్రాక్ సినిమా దాదాపు కంప్లీట్ కానీకొచ్చింది. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో అన్ని సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ రద్దు చేయబడ్డాయి. లాక్ ‌డౌన్ తర్వాత ఈ సినిమాను ఎపుడు విడుదల చేస్తారనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Allu Arjun, Ravi Teja, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు