Home /News /movies /

RAVI TEJA TIGER NAGESWARA RAO UPDATE 7 CRORE WORTH SET ERECTED HERE ARE THE DETAILS SR

Ravi Teja | Tiger Nageswara Rao : టైగర్ నాగేశ్వరరావు అప్ డేట్.. ఏడు కోట్లతో భారీ విలేజ్ సెట్.. తగ్గేదేలే..

Ravi Teja Tiger Nageswara Rao Photo : Twitter

Ravi Teja Tiger Nageswara Rao Photo : Twitter

Ravi Teja | Tiger Nageswara Rao : రవితేజ వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) అనే ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఖతర్నాక్ అప్ డేట్ వచ్చింది.

  Ravi Teja | మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) లాస్ట్ ఇయర్ 2021లో కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ‘క్రాక్’ మూవీతో బంపర్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి ఆయనకు కొత్త ఊపిరిని ఇచ్చింది. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) అనే ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి రవితేజ  (Ravi Teja) లుక్‌ను విడుదల చేసింది టీమ్. ఈ (Tiger Nageswara Rao) సినిమా కోసం రవితేజ లుక్ మాత్రం ఊహించని రేంజ్‌లో ఉంది. రవితేజ 71వ చిత్రంగా వస్తున్న టైగర్ కోసం రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో రాబోతున్నారు. అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో అప్ డేట్ వచ్చింది. భారీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఏకంగా 7 కోట్లు ఖర్చు చేసి ఒక పెద్ద సెట్‌ను చిత్రబృందం నిర్మిస్తున్నారని తెలుస్తోంది. పాతకాలంలో విలేజ్ సెట్ కోసం ఇదంతా ఖర్చు చేస్తున్నారట. దాదాపు ఓ ఐదు ఎకరాల్లో ఈ సెట్ నిర్మాణం జరుగనుందని అంటున్నారు. ఇక ఈ సినిమా రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. నుపుర్ సనన్ (Nupur Sanon) విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. అక్క బాటలో ఈమె కూడా హీరోయిన్‌గా లక్‌ను పరీక్షించుకుంటోంది. మరో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు.

  ఇక  ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఎంతో పేరుండేది. ఈయన్ని బ్రిటిష్ పట్టుకొని ఉరి తీశారు. ఓ రకంగా ఉన్నవాళ్లను దోచుకొని .. బీద సాదలకు పెట్టడం ఈయన్ని అందరు ముందుగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అని పిలిచేవారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. రవితేజ టైగర్‌తో పాటు మూడు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలా రోజులకు వేణు తొట్టెంపూడి కూడా నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉండనుందట. ఈ సినిమాను ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.



  Nivetha Pethuraj : సాగర తీరంలో అందంగా అదరగొట్టిన నివేదా పేతురాజ్.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

  ఈ సినిమాలతో పాటు రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఇక రవితేజ నటించిన తాజాగా ఖిలాడి (Khiladi) . రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ (Khiladi) సినిమా ఫిబ్రవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా విడుదలైన 28 రోజుల్లోపే ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఖిలాడి మార్చి 11 నుంచి హాట్ స్టార్‌లో (Khiladi on Hotstar) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో డింపుల్ హయాతీ (Dimple Hayathi), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందించారు. యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసారు.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Raviteja, Tiger Nageswara Rao, Tollywood news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు