హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: ఉగాది రోజున కొత్త దర్శకుడితో కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్న రవితేజ..

Ravi Teja: ఉగాది రోజున కొత్త దర్శకుడితో కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్న రవితేజ..

రవితేజ Photo : Twitter

రవితేజ Photo : Twitter

Ravi Teja:  2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తాాజాగా రవితేజ... ఉగాది రోజున కొత్త దర్శకుడితో కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టనున్నాడు.

  Ravi Teja:  2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ సినిమా ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసాడు. ఆ సంగతి పక్కనపెడితే.. రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా టీజర్‌ను ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. మరోవైపు రవితేజ.. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సంగతి పక్కన పెడితే. .రవితేజ..  ఈ ఉగాది పండగ శుభ దినాన.. శరత్ మండవ అనే కొత్త దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు కొబ్బరికాయ కొట్టనున్నాడు.

  గతంలో రవితేజ ..శ్రీను వైట్ల, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్ దర్శకులను పరిచయం చేసిన ట్రాక్ ఉంది. వీళ్లందరు టాలీవుడ్ అగ్ర దర్శకులుగా రాణిస్తున్నారు. తాజాగా శరత్ మండవ టాలీవుడ్‌లో రవితేజ సినిమాతో దర్శకుడి మారతున్నాడు. ఈయన లండన్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి పలు తెలుగు, తమిళ చిత్రాలకు రచయతగా పనిచేశారు.

  Ravi Teja Starts New Project With Sarath Mandava On Ugadi Festival Here Are The Details,Ravi Teja: ఉగాది రోజున కొత్త దర్శకుడితో కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్న రవితేజ..,Ravi Teja,Ravi Teja Twitter,Ravi Teja Instagram,Ravi Teja,Boyapati Srinu,Boyapati Srinu,Ravi Teja New Movie,Ravi Teja New Starts Ugadi,Ravi Teja Sarath Mandava,Sarath Mandanva,Ravi Teja Khiladi,Ravi Teja Nakkina Trinadha Rao,Tollywood,రవితేజ,రవితేజ,రవితేజ,బోయపాటి శ్రీను,రవితేజ బోయపాటి శ్రీను
  కొత్త దర్శకుడు శరత్ మండవతో రవితేజ కొత్త చిత్రం (File/Photo)

  ఇపుడు మాస్ మహారాజ్ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాను నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో రవితేజ రొటిన్‌కు భిన్నంగా కనిపించనున్నాడట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉందట. ఆల్రెడీ ఓ హీరోయిన్‌గా రష్మికను ఎంపిక చేసినట్టు సమాచారం. మరో హీరోయిన్‌గా పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మరోవైపు రవితేజ.. బోయపాటి శ్రీనుతో సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. మొత్తంగా క్రాక్ హిట్‌తో రవితేజ దూకుడు మాములుగా లేదుగా.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు