Kimi Sharma: ఖడ్గం హీరోయిన్ కిమ్ శర్మ ఇప్పుడు ఏం చేస్తుంది.. ఎక్కడ ఉందొ తెలుసా?

Kimi Sharma

Kimi Sharma: బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కిమ్ శర్మ గురించి అందరికీ పరిచయమే. తన గ్లామర్ తో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఖడ్గం సినిమాతో పరిచయమైంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలను దూరం పెట్టి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది.

  • Share this:
    Kimi Sharma: బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ కిమ్ శర్మ గురించి అందరికీ పరిచయమే. తన గ్లామర్ తో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ఖడ్గం సినిమాతో పరిచయమైంది. ఇక పెళ్లి తర్వాత సినిమాలను దూరం పెట్టి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. మళ్లీ రీ ఎంట్రీతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ బ్యూటీ. 1993లో బాలీవుడ్ సినిమాతో అతిథి పాత్రతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత మొహబతీన్ సినిమాలో హీరోయిన్ గా అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలా పలు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది.

    ఇది కూడా చదవండి: హీరోయిన్ సంగీతపై ఆమె తల్లి ఫిర్యాదు... ఆమె తనతో ఆ పనులు చేయించిందన్న ‘ఖడ్గం’ బ్యూటీ..

    2002లో ఖడ్గం సినిమాలో నటించి తన పాత్రకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత మగధీర సినిమాలో కూడా చిన్న పాత్రలో నటించింది. ఇదిలా ఉంటే ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కు ఈ బ్యూటీ కజిన్ అవుతుంది. ఇక ఈమె వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు ప్రకటనల్లో నటించింది. మొదట క్లోజప్ టూత్ పేస్ట్ యాడ్ కోసం ఎంపికైన ఈ బ్యూటీ ఆ తర్వాత సన్ సిల్క్, టాటా సఫారీ, ఫెయిర్ అండ్ లవ్లీ, క్లీన్ అండ్ క్లియర్ వంటి పలు వాణిజ్యపర ప్రకటనల్లో బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది.

    ఇది కూడా చదవండి: బికినీ ఫోజులతో పోరగాండ్ల బుర్ర కరాబు చేస్తున్న ఖడ్గం హీరోయిన్

    యువరాజ్ సింగ్ తో లవ్ ట్రాక్ నడిపినట్లు గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో గాసిప్ లు హాల్ చల్ చేసాయ్. ఆ తర్వాత యువరాజ్ సింగ్ కు బ్రేక్ అప్ చెప్పగా 2010లో కెన్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అలీ పంజనీని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటూ తన పెళ్లి జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. అయితే ఈ బ్యూటీ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు వస్తున్నాయ్.మరి కిమ్ ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.
    Published by:Navya Reddy
    First published: