హోమ్ /వార్తలు /సినిమా /

Dhamaka Movie Review: ‘ధమాకా’ మూవీ రివ్యూ.. రవితేజ మార్క్ ఎంటర్టైనర్..

Dhamaka Movie Review: ‘ధమాకా’ మూవీ రివ్యూ.. రవితేజ మార్క్ ఎంటర్టైనర్..

ధమాకా మూవీ రివ్యూ (Dhamaka Photo : Twitter)

ధమాకా మూవీ రివ్యూ (Dhamaka Photo : Twitter)

Dhamaka Movie Review | క్రాక్ మూవీ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీి’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో రవితేజ బ్యాక్ బౌన్స్ అయ్యాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రివ్యూ : ధమాకా (Dhamaka)

నటీనటులు : రవితేజ,శ్రీలీల, జయరామ్, సచిన్ ఖేడ్‌కర్, తనికెళ్ల భరణి, రావు రమేష్,పవిత్ర లోకేష్,ఆలీ తదితరులు..

ఎడిటర్: ప్రవీణ్ పూడి

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

నిర్మాత : అభిషేక్ అగర్వాల్, T.G.విశ్వప్రసాద్

దర్శకత్వం: త్రినాథరావు నక్కిన

విడుదల తేది : 23/12/2022

క్రాక్ మూవీ తర్వాత రవితేజ హీరోగా నటించిన ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీి’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘ధమాకా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో రవితేజ బ్యాక్ బౌన్స్ అయ్యాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.

కథ విషయానికొస్తే..

ధమాకా కథ విషయానికొస్తే.. నంద గోపాల్ చక్రవర్తి (సచిన్ ఖేడ్‌కర్) పెద్ద ఇండస్ట్రీలిస్ట్. తన కంపెనీలో ఉన్న ఉద్యోగులను కన్నతండ్రి వలె చూసుకుంటూ ఉంటారు. ఈయన తన కంపెనీ వార్షికోత్సవంలో తాను ఎక్కువ రోజులు బతకనని చెబుతారు. ఇక జేపీ (జయరామ్) మరో ఇండస్ట్రీలిస్ట్. ఇతను వేరే కంపెనీలను నయానో భయానో లాక్కుంటూ ఉంటారు. ఇతను చూపు నంద గోపాల్ చక్రవర్తి కంపెనీపై పడుతోంది. నందగోపాల్‌ను కూడా ఇదే తరహాలో బెదరిస్తాడు జేపీ.  ఈ నేపథ్యంలో నందగోపాల్  చక్రవర్తి తన కుమారుడు ఆనంద్ చక్రవర్తి (రవితేజ)ని కంపెనీ సీఈవో చేయాలనుకుంటాడు. మరోవైపు ఆనంద్ చక్రవర్తి వలే స్వామి (రవితేజ) మరో వ్యక్తి ఉంటాడు.  అసలు స్వామికి, ఆనంద్ చక్రవర్తికి ఉన్న సంబంధం ఏమిటి ? ఇక నందగోపాల్ కంపెనీని టేకోవర్ చేసుకోవాలనుకున్న జేపీ పన్నాగాన్ని నందగోపాల్ కుమారుడు ఆనంద్ చక్రవర్తి ఎలా ఛేధించాడు. దానికి స్వామి ఎలా సాయ పడ్డాడు. ఈ  క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలే ఈ సినిమా స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

దర్శకుడు నక్కిన త్రినాథ రావు ఇప్పటి వరకు కామెడీ జానర్‌లోనే సినిమాలు తెరకెక్కించి ఓ మోస్తరు విజయాలు అందుకున్నారు. ఇక రవితేజతో చేసిన ‘ధమాకా’ మూవీని కూడా సాదాసీదా కథతో తనదైన కామెడీ ఎంటర్టైనర్‌గా మలిచాడు. మనం ఇప్పటి వరకు చూసిన ‘అల వైకుంఠపురములో’, ’అజ్ఞాతవాసి’  సినిమాలను కాస్త అటూ ఇటూగా మార్చి రవితేజ మార్క్ కామెడీ ప్లస్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమాను మలిచాడు. ముఖ్యంగా బీ,సీ సెంటర్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకొని  ఈ సినిమాను తెరకెక్కించాడు. థియేటర్స్‌‌లో కామన్ ఆడియన్స్ కోరుకునే యాక్షన్, కామెడీ ప్లస్ హీరోయిన్ గ్లామర్‌నే నమ్మకున్నాడు. ఇక రవితేజ‌లోని కామెడీ యాంగిల్‌ను బాగానే వాడుకున్నాడు. ఇక యాక్షన్ చిత్రాలను కామెడీ ఎంటర్టైనర్‌గా తీయడం ఎలాగో చక్కగా చేసి చూపించాడు. ప్రేక్షకులు గొప్పగా ఫీలయ్యే కథ లేకపోయినా.. సీట్లలో కూర్చున్న ఆడియన్స్‌కు కోరకున్నంత వినోదం పంచడంలో సక్సెస్ అయ్యాడు. ఈయనలో త్రివిక్రమ్, జంధ్యాల మార్క్ కామెడీ కూడా కనిపించింది. జంధ్యాల తెరకెక్కించిన ‘ష్.. గప్‌చుప్‌’ సినిమాలోని తిట్ల దండకాన్ని ఈ సినిమాలో రవితేజ, రావు రమేష్‌లపై చిత్రీకరించారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్లైమాక్స్ ఎలా తీయాలో అర్ధం కాక ఏదో హడావుడి ముగించినట్టు ఉంది.

ఇతర టెక్నిషియన్స్ విషయానికొస్తే.. భీమ్స్ అందించిన సంగీతం, ఆర్ఆర్ ఇరగదీసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే పాట ఆడియన్స్‌ను డబుల్ కిక్ ఇచ్చాడు. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను అదనపు ఆకర్షణ. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్ తన కత్తికి ఇంకాస్త పదును పెడితే బాగుండేది.

నటీనటుల విషయానికొస్తే.. 

రవితేజ విషయానికొస్తే.. ఇలాంటి రొటీన్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మాస్ మహారాజ్‌కు కొత్త కాదు. తన పాత్రను ఎంతో ఈజ్‌తో చేసాడు. కొన్ని సన్నివేశాల్లో తన ఏజ్ ఏంటేని తెలుస్తూనే ఉంది. సినిమా మొత్తం తనదైన యాక్షన్‌ కామెడీతో అదరగొట్టేసాడు. శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. రవితేజ సరసన బాగనే సెట్ అయింది. ఈమె డాన్స్ మూమెంట్స్  ఈ సినిమాకు ప్లస్. బీ,సీ సెంటర్ ఆడియన్స్ కోరకునే అన్ని హంగులు శ్రీలీలలో పుష్కలంగా ఉన్నాయి. ఈ సినిమాతో శ్రీలీల కెరీర్ గ్రాఫ్ పెరగడం పక్కా అని చెప్పొచ్చు. ఇతర పాత్రల్లో నటించిన రావు రమేష్, హైపర్ ఆది కామెడీ థియేటర్స్‌‌లో నవ్వులు పూయించాయి. ఇక తనికెళ్ల భరణి, సచిన్ ఖేడ్‌కర్ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇక విలన్‌గా  జయరామ్ నటన బాగుంది. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

ప్లస్ పాయింట్స్ 

రవితేజ మార్క్ యాక్షన్ కామెడీ

శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్

మ్యూజిక్, ఆర్ఆర్

మైనస్ పాయింట్స్ 

రొటీన్ స్టోరీ

లాజిక్‌కు అందని సన్నివేశాలు

క్లైమాక్స్

చివరి మాట: రవితేజ మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్

రేటింగ్ : 2.5/5

First published:

Tags: Dhamaka, Ravi Teja, Sreeleela, Tollywood

ఉత్తమ కథలు