హోమ్ /వార్తలు /సినిమా /

Krack movie World Digital Premiere: ‘క్రాక్’ డిజిటల్ ప్రీమియర్ ఆ రోజే.. కన్ఫర్మ్ చేసిన ఆహా..

Krack movie World Digital Premiere: ‘క్రాక్’ డిజిటల్ ప్రీమియర్ ఆ రోజే.. కన్ఫర్మ్ చేసిన ఆహా..

 క్రాక్:

క్రాక్:

Krack movie World Digital Premiere: ఒకటి రెండు కాదు నాలుగేళ్ళ తర్వాత రవితేజ మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఈయన నటించిన క్రాక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది. మూడు వారాల్లోనే 37 కోట్ల వరకు షేర్ వసూలు చేసి హిట్ ట్రాక్ ఎక్కింది.

ఇంకా చదవండి ...

ఒకటి రెండు కాదు నాలుగేళ్ళ తర్వాత రవితేజ మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఈయన నటించిన క్రాక్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది. మూడు వారాల్లోనే 37 కోట్ల వరకు షేర్ వసూలు చేసి హిట్ ట్రాక్ ఎక్కింది. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకు వచ్చిన విజయం ఇదే. కరోనా కారణంగా 50 ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి వసూళ్లు ఇలా ఉన్నాయి కానీ అదే 100 శాతం ఉండుంటే కచ్చితంగా 50 కోట్ల షేర్ దాటిపోయేది. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యుండేది. ఇప్పటికీ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. మొన్న రిపబ్లిక్ డే రోజు ఏకంగా కోటిన్నర షేర్ తీసుకొచ్చి సంచలనం సృష్టించింది క్రాక్. ఇప్పటికీ రోజుకు కనీసం చెప్పుకోదగ్గ వసూళ్లే వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు క్రాక్ ఓటిటి విడుదల తేదీని అనౌన్స్ చేసింది ఆహా. కరోనా కారణంగా ఇప్పుడు దర్శక నిర్మాతలు సినిమా విడుదల తేదీతో పాటు ఓటిటి రిలీజ్ డేట్ కూడా ముందుగానే నిర్ణయించుకుంటున్నారు. కలెక్షన్స్ కానీ లేకపోతే ఒకట్రెండు వారాల్లోనే సినిమా ఒరిజినల్ ప్రింట్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్స్‌లో విడుదలైన వారం రోజుల తర్వాత ఓటిటిలో విడుదల చేసారు. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను జీ స్టూడియోస్ విడుదల చేసింది.

ravi teja krack movie,ravi teja krack movie ott release,krack movie collections,krack movie Aha ott release,krack movie 6 days collections,krack movie box office collection,ravi teja krack,krack movie collection,క్రాక్,క్రాక్ కలెక్షన్స్,రవితేజ క్రాక్ 6 డేస్ కలెక్షన్స్,రవితేజ క్రాక్ ఓటిటి విడుదల తేదీ
రవితేజ క్రాక్ (Ravi Teja Krack)

ఇప్పుడు రవితేజ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. అయితే మరీ ఒక్క వారం కాదు మూడు వారాల తర్వాత క్రాక్ ఓటిటిలో విడుదల అవుతుంది. మంచి వసూళ్లతో దూసుకుపోతుండటంతో మరో మూడు వారాల తర్వాత ఈ సినిమాను విడుదల చేస్తున్నారు ఆహా. ఫిబ్రవరి 5న ఆహాలో వరల్డ్ ప్రీమియర్ కానుంది క్రాక్. ఈ సినిమా ఓటిటిలో చాలా త్వరగానే విడుదల కానుంది. ముందు జనవరి 29నే అనుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు వెనక్కి తగ్గారు.

ravi teja krack movie,ravi teja krack movie ott release,krack movie feb 5th Aha release,krack movie Aha ott release,krack movie 20 days collections,krack movie box office collection,ravi teja krack,krack movie collection,క్రాక్,క్రాక్ కలెక్షన్స్,రవితేజ క్రాక్ ఫిబ్రవరి 5న ఓటిటి విడుదల తేదీ,ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ క్రాక్
క్రాక్ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ (Krack movie)

అల్లు అరవింద్ ఆహా సంస్థ క్రాక్ సినిమాను భారీ రేట్ పెట్టి సొంతం చేసుకున్నారు. దాదాపు 8.40 కోట్లకు ఈ సినిమా రైట్స్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. థియెట్రికల్ కలెక్షన్స్ డ్రాప్ అయిన తర్వాత క్రాక్ ఓటిటి విడుదల చేయనున్నారు. ఏదేమైనా కూడా మరీ ఇంత త్వరగా క్రాక్ వస్తుందని తెలియక షాక్ అవుతున్నారు రవితేజ అభిమానులు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Aha OTT Platform, Krack, Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు