హోమ్ /వార్తలు /సినిమా /

చిరంజీవి సినిమాలో రవితేజ చనిపోతాడా ? రోల్ లీక్ అయ్యిందా ?

చిరంజీవి సినిమాలో రవితేజ చనిపోతాడా ? రోల్ లీక్ అయ్యిందా ?

బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే పవన్, రవితేజ, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో బాబీని పూర్తిగా నమ్మేస్తున్నాడు చిరు. ఇందులో అభిమాని, స్టార్ హీరో మధ్య జరిగే ఎమోషనల్ కథను చూపించబోతున్నాడు బాబీ.

బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ రాజా రవితేజ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే పవన్, రవితేజ, వెంకటేష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో బాబీని పూర్తిగా నమ్మేస్తున్నాడు చిరు. ఇందులో అభిమాని, స్టార్ హీరో మధ్య జరిగే ఎమోషనల్ కథను చూపించబోతున్నాడు బాబీ.

రవితేజ పాత్ర గురించి తెలిసి అంతా షాక్ అవుతున్నారు. అయితే సినిమాలో ఈ సీన్ తర్వాత చిరు పాత్రలో మార్పు వస్తుందని టాక్ వినిపిస్తోంది.

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దొరికితే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఇక చాలామంది కోస్టార్స్‌తో ఆయన సినిమాలు తీశారు. గతంలో హీరో శ్రీకాంత్‌తో కలిసి శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోతో మల్లీస్టారర్ సినిమాలో కనిపించనున్నారు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). మాస్ మహా రాజా రవితేజతో (Ravi Teja)కలిసి చిరు సినిమా చేస్తున్నారు. రవితేజ కూడా.. ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రాక్షసుడు సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ, మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘టైగర్ నాగేశ్వర్ రావు’(Tiger Nageswar rao)లో కూడా నటిస్తున్నాడు. వరుసబెట్టి సినిమాలను చేస్తున్న రవితేజ, మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో కూడా భాగం కానున్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ సినిమాలో రవితేజ ఓ కేమియో రోల్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

దర్శకుడు బాబీ (Bobby) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి పాత్ర సరికొత్తగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో రవితేజ పాత్రకు సంబంధంచిన సమాచారం బయటకు వచ్చింది. చిరు సినిమాలో రవితేజ పాత్ర సెకండాఫ్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో రవితేజ పాత్ర మనకు కనిపిస్తుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపిస్తాడని.. ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో రవితేజ(Ravi Teja) చనిపోతాడని.. అతడి మరణం తరువాత చిరంజీవి పాత్రలో చాలా మార్పు వస్తుందని కూడా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో రవితేజ పాత్ర దాదాపు 40 నిమిషాల పాటు ఉంటుందట. అంతేకాదు, ఈ చిత్రం కోసం ఈ మాస్ హీరో 20 రోజులు డేట్స్ కేటాయించాడని కూడా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఐతే, ఈ వార్తల పై ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. నిజంగానే రవితేజ ఈ సినిమాలో అలాంటి పాత్రలో కనిపిస్తాడా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. డైరెక్టర్ బాబీ ఈ సినిమా షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించగా, ఈ సినిమాలో అందాల భామ శృతి హాసన్(Shruthi Hasan) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇద్దరు స్టార్ హీరోల కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

First published:

Tags: Chiranjeevi, Director bobby, Megastar Chiranjeevi, Ravi Teja

ఉత్తమ కథలు