హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: రావణాసుర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ మహారాజా ఫ్యాన్స్‌ పూనకాలెత్తే స్కెచ్

Ravi Teja: రావణాసుర ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. మాస్ మహారాజా ఫ్యాన్స్‌ పూనకాలెత్తే స్కెచ్

Ravi Teja Ravanasura (Photo Twitter)

Ravi Teja Ravanasura (Photo Twitter)

Ravanasura Trailer Release Date: మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా రాబోతున్న కొత్త సినిమా రావణాసుర. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా రాబోతున్న కొత్త సినిమా రావణాసుర. సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘ ఆకాష్ అలాగే దక్ష నగర్కర్ లు ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా ధమాకా (Dhamaka), వాల్తేరు వీరయ్య (Waltair Veerayya) సినిమాలతో భారీ హిట్స్ ఖాతాలో వేసుకున్న రవి తేజ.. ఇప్పుడు రావణాసుర (Ravanasura) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూనకాలెత్తించే అప్ డేట్ ఇచ్చారు. యూనిట్ అంతా ప్రత్యేక శ్రద్ద పెట్టి చిత్ర ట్రైలర్ కట్ చేశారట. ఈ ట్రైలర్ ను మార్చి 28వ తేదీ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆ పోస్టర్ ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశారు రవితేజ. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ భారీ రెస్పాన్స్ అందుకోవడంతో ఈ ట్రైలర్ పై ప్రతి ఒక్కరి దృష్టి పడింది.

మాస్ ఆడియన్స్ కోరుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని, అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ మూవీని గ్రాండ్ గా రూపొందిస్తున్నారని విన్నాం. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకు వదిలిన అప్ డేట్స్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనుండటం ఆసక్తికర అంశం. త్వర త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ సినిమాను ఏప్రిల్ 7 న రిలీజ్ చేయాలని ఫిక్సయ్యారు మేకర్స్.

View this post on Instagram

A post shared by RAVI TEJA (@raviteja_2628)

ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో బాణీలు కడుతున్నారు. మరో మాస్ ట్రీట్ ఇచ్చేందుకు రవితేజ రెడీ కావడంతో ఈ సినిమాపై బోలెడన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్రం కోసం మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

First published:

Tags: Ravanasura Movie, Ravi Teja, Sudheer Varma, Tollywood

ఉత్తమ కథలు