మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా విలక్షణ కథలు ఎంచుకుంటూ ముందుకెళ్తున్నారు. మాస్ ఆడియన్స్‌కి కిక్కిచ్చే పాత్రలతో అలరిస్తున్నారు. 2021లో ‘క్రాక్’ మూవీతో సక్సెస్ బాట పట్టిన రవితేజ.. అప్పటినుంచి భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అందులో ఒకటే సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో రూపొందుతున్న ‘రావణాసుర’ మూవీ. తాజాగా నేడు (సోమవారం) దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.
సుధీర్ వర్మ రూపొందిస్తున్న ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ చిత్రానికి (Ravanasura) రావణాసుర టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో రవితేజ లుక్ ఇప్పటికే విడుదలవ్వగా తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.
ఈ మేరకు విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్ లో రవితేజ రఫ్ లుక్ లో కనిపించారు. మాస్ ఆడియన్స్ కోరుకునే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని, అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ మూవీని గ్రాండ్ గా రూపొందిస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో అను ఇమ్మానుయేల్, ఫరియా, మేఘ ఆకాష్ అలాగే దక్ష నగర్కర్ లు ఫీమేల్ లీడ్ లో కనిపించనుండగా.. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. భీమ్స్ సంగీతం సంగీతం అందిస్తున్నాడు.
దీపావళి శుభాకాంక్షలు ????
Welcoming you all to the exciting world of #RAVANASURA from April 7th 2023 ❤️@iamSushanthA @sudheerkvarma @AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks pic.twitter.com/AKAzLuQZuR — Ravi Teja (@RaviTeja_offl) October 24, 2022
ప్రస్తుతం రవితేజ చేతిలో ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’, 'ధమాకా' సినిమాలు ఉన్నాయి. ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా ఈ సినిమా రాబోతోంది. 1970ల నేపథ్యంలో సాగే ఈ మూవీలో ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని గెటప్‌లో రవితేజ కనిపించనున్నారు. ‘దొంగాట’ ఫేం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి చతికిలపడింది. దీంతో రవితేజ తదుపరి సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు మాస్ మహారాజ్ ఫ్యాన్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravanasura Movie, Ravi Teja, Tollywood