Ravi teja - Ravanasura Censor Talk Review : మాస్ మహారాజా రవితేజ (Raviteja ) గతేడాది ధమాకా సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. పెళ్లి సందD భామ శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా 2022 డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత చిరంజీవి హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో విక్రమ్ సాగర్‌గా చిరు తమ్ముడి పాత్రలో అదరగొట్టాడు. ఇక ఆ సినిమాల తర్వాత రవితేజ నటించిన లేటెస్ట్ సినిమా రావణాసుర. ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకానుంది. ఇప్పటికే విడుదలైన ‘రావణాసుర’ ట్రైటర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలు బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఫైట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. మర్డర్ చేయడం నేరం.. మర్డర్ దొరక్కకుండా చేయడం ఆర్ట్.. అంటూ రవితేజ చెప్పే డైలాగ్‌కు రెస్పాన్స్ బాగుంది.
మొత్తంగా మంచి యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలతో ప్రస్తుతం రావణాసుర ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది.ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమాలో రవితేజ హీరోగా నటించగా.. దక్ష నగర్కర్, అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్‌గా చేశారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. సుశాంత్ కీలక పాత్రలో నటించారు. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు కనిపించనున్నారు. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమా మొత్తం యాక్షన్ రక్తపాతం ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాను ‘A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఐతే.. ఈ సినిమాలో సస్పెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుందని చెబుతున్నారు.
ఇక ఈ సినిమా నడివి 2 గంటల 11 నిమిషాలు ఉంది. ఇక మరోవైపు రావణాసుర (Ravanasura ) నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీగా బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 భారీ ధరకు దక్కించుకుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ రైట్స్ దాదాపుగా రూ. 12 కోట్లకు పైగానే అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ఈసినిమా శాటిలైట్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకుంది.
Shelved movies of Tollywood: అనౌన్స్‌మెంట్ తర్వాత ఆగిపోయిన బడా హీరోల సినిమాలు ఇవే..
ఇప్పటికే ఓ మూడు సినిమాల్లో నటిస్తున్నారు రవితేజ. కాగా ఆయన మరో సినిమాకు ఓకే అన్నట్లు తెలుస్తోంది. మరోసారి హారీష్ శంకర్ ( Harish Shankar) దర్శకత్వంలో రవితేజ ఓ సినిమాను చేయనున్నట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు. అయితే, ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రవితేజ కోసం హరీష్ శంకర్ ఇప్పటికే ఓ కథను రెడీ చేశారని.. రవితేజ కూడ ఓకే అన్నారని టాక్. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుందట (Mythri movie makers). గతంలో హరీష్ దర్శకత్వంలో రవితేజ షాక్, మిరపకాయ్ వంటి సినిమాలను చేశారు.
ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) అనే ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. రవితేజ 71వ చిత్రంగా వస్తున్న టైగర్ కోసం రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో రాబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. నుపుర్ సనన్ (Nupur Sanon) విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. మరో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ravanasura Movie, Ravi Teja, Sudheer Varma, Tollywood