Home /News /movies /

RAVI TEJA RAVANASURA MOVIE AUDIO RIGHTS GEST GOOD PRICE HERE ARE THE DETAILS SR

Ravi Teja | Ravanasura : భారీ ధరకు అమ్ముడైన రవితేజ రావణాసుర ఆడియో రైట్స్..

Ravi Teja Ravanasura movie audio rights Photo : Twitter

Ravi Teja Ravanasura movie audio rights Photo : Twitter

Ravi Teja | Ravanasura : రవితేజ కెరీర్‌లో 70వ సినిమాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి (Ravanasura) రావ‌ణాసుర టైటిల్‌ను ఫైన‌ల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ర‌వితేజ లుక్ ఇప్ప‌టికే విడుద‌ల‌వ‌్వగా తాజాగా మరో అప్ డేట్ వచ్చింది.

ఇంకా చదవండి ...
    Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా పోయిన యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ (Ravi Teja) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ  (Ravi Teja) హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అంతేకాకుండా వాటిని ఏకకాలంలో కూడా ఫినిష్ చేస్తున్నారు. క్రాక్ తర్వాత ఏకంగా మూడు సినిమాల అనౌన్స్ చేసిన (Ravi Teja) రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. ఇక రవితేజ కెరీర్‌లో 70వ సినిమాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి (Ravanasura) రావ‌ణాసుర టైటిల్‌ను ఫైన‌ల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ర‌వితేజ లుక్ ఇప్ప‌టికే విడుద‌ల‌వ‌్వగా తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా ఆడియో హ‌క్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. రావణాసుర ఆడియో రైట్స్‌ను పాపుల‌ర్ మ్యూజిక్ లేబుల్ స‌రిగ‌మప ద‌క్కించుకున్న‌ట్టు తెలుస్తోంది.

    యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, అనూ ఇమ్మాన్యుయేల్ , ద‌క్షా న‌గార్క‌ర్, పూజిత పొన్నాడ, జాతిర‌త్నాలు ఫేమ్ ఫ‌రియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్స్‌గా చేస్తున్నారు. సుశాంత్ మరో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీలో ర‌వితేజ లాయ‌ర్‌గా క‌నిపించ‌నున్నారని తెలుస్తోంది. అభిషేక్ పిక్చ‌ర్స్, ర‌వితేజ టీం వ‌ర్క్స్ ప‌తాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రామేశ్వ‌ర్-బీమ్స్ సిసిరొలియో ద్వయం సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా సెప్టెంబర్ 30న గ్రాండ్‌గా విడుదలకానుంది.




    ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడి’ సినిమా తాజాగా ఫిబ్రవరి 11న విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో కనిపించారు. రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రవితేజ సరసన .. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలతో పాటు రవితేజ మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా విడుదలైంది. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. వీటితో రవితేజ టైగర్ నాగేశ్వరావు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Ravanasura Movie, Raviteja, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు