Home /News /movies /

RAVI TEJA RAVANASURA ANOTHER ACTION PACKED SCHEDULE WRAPED UP HERE ARE THE DETAILS TA

Ravi Teja - Ravanasura : రవితేజ రావణాసుర మరో యాక్షన్ ప్యాకడ్‌ షెడ్యూల్ పూర్తి..

రవితేజ ‘రావణాసుర’ కీలక షెడ్యూల్ పూర్తి (Twitter/Photo)

రవితేజ ‘రావణాసుర’ కీలక షెడ్యూల్ పూర్తి (Twitter/Photo)

Ravi Teja - Ravanasura : రవితేజ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో సుధీర్ వర్మ దర్శకత్వంలో‘రావణాసుర’ మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక షెడ్యూల్ కంప్లీటైనట్టు ట్వీట్ చేశారు.

    Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా పోయిన యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ (Ravi Teja) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కొత్త ఊపిరిని ఇచ్చింది. మరోవైపు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ  (Ravi Teja)  హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. అంతేకాకుండా వాటిని ఏకకాలంలో కూడా ఫినిష్ చేస్తున్నారు. క్రాక్ తర్వాత ఏకంగా మూడు సినిమాల అనౌన్స్ చేసిన (Ravi Teja) రవితేజ.. వాటిలో రెండు సినిమాలు షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. అది అలా ఉంటే రవితేజ కెరీర్‌లో 70వ సినిమాని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

    ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి (Ravanasura) రావ‌ణాసుర టైటిల్‌ను ఫైన‌ల్ చేశారు. ఈ సినిమాలో ర‌వితేజ లుక్ ఇప్ప‌టికే విడుద‌ల‌వ‌్వగా తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా మరో కీలక యాక్షన్  షెడ్యూల్ పూర్తి అయ్యినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ  (Ravanasura) చిత్రంలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 30న గ్రాండ్‌గా విడుదలకానుంది.

    Kajal-Pranitha-Sonam : బిగ్‌బాస్ బ్యూటీ సహా కాజల్,ప్రణీత, సోనమ్ సహా ప్రెగ్నెంట్‌గా ఉన్న కథానాయికలు వీళ్లే.. అందులో ఒకరైతే మూడోసారి గర్భవతి..


    ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఇటీవల ఓ ప్యాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. టైగర్ నాగేశ్వరావుగా వస్తోన్న సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ‘ఖిలాడి’ సినిమా తాజాగా ఫిబ్రవరి 11న విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో కనిపించారు. రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో రవితేజ సరసన .. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.ఈ సినిమాలతో పాటు రవితేజ మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Ravanasura Movie, Ravi Teja, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు