హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: రవితేజ ‘ఖిలాడి’లో విలన్‌గా యాక్షన్ హీరో.. అధికారిక ప్రకటన..

Ravi Teja: రవితేజ ‘ఖిలాడి’లో విలన్‌గా యాక్షన్ హీరో.. అధికారిక ప్రకటన..

Ravi Teja: రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక రవితేజ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విలన్‌గా యాక్షన్ హీరో నటిస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు.

ఇంకా చదవండి ...

  Ravi Teja: 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ మూవీ  ఈ యేడాది తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు రవితేజకు మంచి పుట్టినరోజు బహుమతిగా ఈ సినిమా నిలిచిపోయింది. అంతేకాదు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేనితో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసాడు. ఆ సంగతి పక్కనపెడితే.. రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక రవితేజ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాలో ఢీ కొట్టే విలన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ నటిస్తున్నాడు.

  ఈ సందర్భంగా చిత్ర యూనిట్.. యాక్షన్ కింగ్ అర్జున్‌ను ‘ఖిలాడి’ మూవీలోకి వెల్కమ్ చెబుతూ ఓ ట్వీట్ విడుదల చేసారు. యాక్షన్ కింగ్ అర్జున్ విషయానికొస్తే.. దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన యాక్షన్ సినిమాలతో యాక్షన్ కింగ్ అనే బిరుదు సంపాదించిన వన్ అండ్ ఓన్లీ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.

  Ravi Teja Ramesh Varma Khiladi Movie Action King Arjun Play Crucial Role officially Announced, Ravi Teja - Arjun: రవితేజ ‘ఖిలాడి’లో విలన్‌గా యాక్షన్ హీరో.. అధికారిక ప్రకటన..,Ravi Teja,Action King Arjun,Arjun Play Villain Role in Khiladi, Ravi Teja, Khiladi Movie First Glimpse,Ravi Teja Khiladi Movie First Glimpse,Khiladi Movie,HBD Ravi Teja,Ravi Teja Birthday,tollywood,Telugu cinema,రవితేజ,రవితేజ ఖిలాడి,రవితేజ ఖిలాడి ఫస్ట్ గ్లింప్స్,ఖిలాడి మూవీ,రవితేజ ఖిలాడి టీజర్,యాక్షన్ కింగ్ అర్జున్,రవితేజ మూవీలో అర్జున్,రవితేజ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్
  రవితేజ ‘ఖిలాడి’లో విలన్‌గా యాక్షన్ కింగ్ అర్జున్ (Twitter/Photo)

  కన్నడనాట జన్మించిన అర్జున్...తమిళంలో అగ్రకథానాయకుడిగా ఒక వెలుగు వెలిగాడు. అంతేనా...తెలుగులో ‘మన్నెంలో మొనగాడు’, మా పల్లెలో గోపాలు ‘హనుమాన్ జంక్షన్‌, శ్రీ ఆంజనేయం’ వంటి డైరెక్ట్ సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.అంతేకాదు ‘జెంటిల్మెన్, ‘ఒకే ఒక్కడు’ వంటి సినిమాలతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీని షేక్ చేసిన ట్రాక్ రికార్డు అర్జున్ సొంతం.  గత కొంత కాలంగా అర్జున్.. హీరోగా నటిస్తూనే.. వేరే హీరో సినిమాల్లో విలన్‌గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. చివరగా..  అల్లు అర్జున్.. ‘ నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో నటించారు. తాజాగా రవితేజ ‘ఖిలాడి’లో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటిస్తున్నాడు. మరి రవితేజ, అర్జున్ పోటాపోటీగా ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.

  First published:

  Tags: Action King Arjun, Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు