హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: షాకిస్తున్న రామారావు థియేటర్ల లెక్క.. మాస్ మేనియా అంటే ఇదేమరి!

Ravi Teja: షాకిస్తున్న రామారావు థియేటర్ల లెక్క.. మాస్ మేనియా అంటే ఇదేమరి!

Photo Credit: Twitter

Photo Credit: Twitter

Ramarao On Duty: చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్కటిగా వదులుతున్న అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ కాబోయే థియేటర్ల సంఖ్యపై ఓ అప్ డేట్ వచ్చింది.

వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రాబోతున్న కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty). ఈ సినిమాపై ఆయన అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షక లోకం భారీ అంచనాలు పెట్టుకుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్కటిగా వదులుతున్న అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు వదిలిన అన్ని అప్‌డేట్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ఈ క్రమంలో తాజాగా రామారావు రాబోయే థియేటర్ల లెక్క షాకిస్తోంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్స్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 29న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు చిత్ర ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి హైప్ పెంచేశారు మేకర్స్. దీంతో ఈ మూవీ విడుదల చేసే థియేటర్స్ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. రవితేజ కెరీర్ లో గతంలో ఎన్నడూలేని విధంగా చాలా గ్రాండ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.

తాజా సమాచారం మేరకు నైజాంలో 235, సీడెడ్‌లో 120, ఆంధ్రాలో 315 అంటే మొత్తంగా రెండు రాష్ట్రాల్లో కలిపి 650 నుంచి 700 థియేటర్లలో ఈ రామారావు ఆన్ డ్యూటీ విడుదల కాబోతోంది. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో మరో 80, ఓవర్సీస్‌లో 250 థియేటర్లలో రిలీజ్ కానుంది. మొత్తంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 1000 నుంచి 1050 థియేటర్లలో విడుదల కానుండటం ఆసక్తికరం.

1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు వదిలిన అప్‌డేట్స్ చూస్తుంటే ఈ సినిమాతో రవితేజ మరోసారి బాక్సాఫీస్ దాడి చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షక లోకం నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకోవడమే గాక విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. సో.. చూడాలి మరి ఈ రామారావు ఏ మేర డ్యూటీ చేస్తాడనేది.

Published by:Sunil Boddula
First published:

Tags: Ramarao On Duty, Ravi Teja, Tollywood

ఉత్తమ కథలు