Home /News /movies /

RAVI TEJA RAMARAO ON DUTY TRAILER RELEASED SLB

Ramarao On Duty Trailer: అసలు వేట ఇప్పుడే మొదలైంది.. చించేసిన రవితేజ!!

Photo Twitter

Photo Twitter

Ravi Teja: అయిదు పదుల వయసు దాటినా యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు రవితేజ. వరుస సినిమాలతో బాక్సాఫీస్ దాడి చేస్తున్న ఈ సీనియర్ హీరో.. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) అనే మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఇంకా చదవండి ...
జయాపజయాల సంగతి అటుంచితే వరుస సినిమాలతో సత్తా చాటుతున్నారు మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja). అయిదు పదుల వయసు దాటినా యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నారు. వరుస సినిమాలతో బాక్సాఫీస్ దాడి చేస్తున్న ఈ సీనియర్ హీరో.. ప్రస్తుతం యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) అనే మూవీ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా ఒక్కో అప్‌డేట్ వదులుతూ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర ట్రైలర్ (Ramarao On Duty Trailer) రిలీజ్ చేశారు.

ఈ ఆపరేషన్ ‘మయం’లో గల్లంతైంది వేరు వేరు ప్రాంతాలకు చెందిన కష్టజీవులు అనే డైలాగ్ తో మొదలై ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలతో ఆకట్టుకుంది ఈ ట్రైలర్. రవితేజ పవర్ ఫుల్ ఎంట్రీని చూపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచేశారు. ఇన్నాళ్లు ఓ గవర్నమెంట్ ఆఫీసర్‌గా చట్టప్రకారం న్యాయం కోసం డ్యూటీ చేసిన నేను.. ఇకపై రామారావుగా ధర్మకోసం డ్యూటీ చేస్తాను అని రవితేజ చెప్పిన డైలాగ్ ఈ సినిమాలో ఆయన రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉండనుందో తెలియజేస్తోంది. అదేవిధంగా హీరోయిన్లతో రవితేజ రొమాంటిక్ సీన్స్ ఈ వీడియోలో హైలైట్ అయ్యాయి.

1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తర్వాత ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘నా పేరు సీసా.. నా పేరు సీసా’ సాంగ్ వైరల్ అయింది. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్నారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్స్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 29న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటివరకు వదిలిన అప్‌డేట్స్ చూస్తుంటే ఈ సినిమాతో రవితేజ మరోసారి బాక్సాఫీస్ దాడి చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది.
Published by:Sunil Boddula
First published:

Tags: Ramarao On Duty, Raviteja, Tollywood

తదుపరి వార్తలు