Home /News /movies /

RAVI TEJA RAMARAO ON DUTY SPECIAL SONG VIRAL ON SOCIAL MEDIA SLB

Ramarao on duty: సీసా ఇది స్వర్గానికి వీసా.. రవితేజ కిక్కంటే ఇదే మరి!

Photo Twitter

Photo Twitter

Ravi Teja: రవితేజ హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకోగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మాస్ మసాలా సాంగ్ రిలీజ్ చేశారు.

ఇంకా చదవండి ...
మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) యమ ఫామ్‌లో ఉన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బాక్సాఫీస్ దాడి చేస్తున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఆయన అయిదు పదుల వయసు దాటినా యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకోగా చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి మాస్ మసాలా సాంగ్ రిలీజ్ చేశారు.

‘నా పేరు సీసా.. నా పేరు సీసా’ అంటూ మత్తెక్కించే పదాలతో సాగిపోతున్న ఈ ఐటెం సాంగ్ ఊపు తెప్పిస్తోంది. శ్రేయాగోషాల్‌ పాడిన ఈ పాట యూత్ ఆడియన్స్‌కి యమ కిక్కిస్తోంది. గత రెండు రోజులుగా ఈ పాట ప్రొమోతో నెట్టింట హల్చల్ చేస్తుండగా.. తాజాగా ఫుల్ లిరికల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ఒకరికి నే తేనె సీసా.. ఒకరికి నే కల్లు సీసా.. ఒకరికి నే మసాలా సీసా.. ఇంకొకరికి రసాల సీసా.. అందరికీ అందిస్తాను స్వర్గానికి వీసా అంటూ వస్తున్న లిరిక్స్ పాటలో హైలైట్ అయ్యాయి.

చంద్రబోస్‌ సాహిత్యం అందించిన ఈ పాటకు శ్యామ్‌ సిఎస్‌ బాణీలు కట్టారు. ఈ పాటతో అన్వేషి జైన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ఆమె గ్లామర్‌ టచ్ ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చూస్తుంటే ఈ సాంగ్ తో థియేటర్స్ దద్దరిల్లి పోతాయని, మాస్ మాహారాజ్ ఆడియన్స్ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారని స్పష్టమవుతోంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై శరత్ మండవ దర్శకత్వంలో ఈ రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) సినిమాను తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik) హీరోయిన్‌గా నటించగా పవిత్ర లోకేష్, నాజర్, వేణు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ మూవీపై రవితేజ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Rama Rao, Ravi Teja, Tollywood actor

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు