Home /News /movies /

RAVI TEJA RAMARAO ON DUTY SEESA PROMO SONG RELEASED TA

Ravi Teja - RamaRao On Duty : రామారావు ఆన్ డ్యూటీ నుంచి ‘నా పేరు సీసా’ ప్రోమో సాంగ్ విడుదల..

రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి నా పేరు సీసా’ సాంగ్ ప్రోమో విడుదల (Twitter/Photo)

రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ నుంచి నా పేరు సీసా’ సాంగ్ ప్రోమో విడుదల (Twitter/Photo)

Ravi Teja - RamaRao On Duty | రవితేజ నటిస్తోన్న లెేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Raviteja Ramarao On Duty) . ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని నా పేరు సీసా అనే ప్రోమో సాంగ్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...
  Ravi Teja - RamaRao On Duty | మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) లాస్ట్ ఇయర్ 2021లో కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత ‘క్రాక్’ మూవీతో బంపర్ హిట్ అందుకున్నారు.  ఈ సినిమా 2021 తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక ఆ సినిమా తర్వాత ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నారు. ఈ యేడాది రవితేజ ‘ఖిలాడి’గా పలకరించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ప్రస్తుతం రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్‌ (Rajisha Vijayan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘ఆన్ డ్యూటీ’ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.

  సామ్ సిఎస్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాకి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అది అలా ఉంటే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్‌ బుల్ బుల్ తరంగ్ (Bul Bul Tarang)అంటూ సాగుతోన్న ఈ పాట నెటిజన్స్‌ను బాగానే ఆకట్టుకుంటోంది. సిద్ శ్రీరామ్ (Sid Sriram) పాడగా.. రాకేందు మౌళి లిరిక్స్ అందించారు. తాజాగా ఈ సినిమాను నా పేరు సీసా అంటూ ప్రోమో సాంగ్‌ను విడుదల చేసారు. ఈ ప్రత్యేక గీతంలో  అన్వేషి జైన్ ఐటెం భామగా మెరిసింది. ఇక నా పేరు సీసా పూర్తి లిరికల్ సాంగ్‌ను జూలై 2న విడుదల చేయనున్నారు.


  యదార్థ సంఘటనల ఆధారంగా వస్తోన్న ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, సర్పట్ట జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ కనిపించనున్నారు. రామారావు ఆన్ డ్యూటీ జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.  ఇక రవితేజ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఆయన టైగర్ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) అనే ఓ ప్యాన్ ఇండియా సినిమాను చేస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి రవితేజ  (Ravi Teja) లుక్‌ను విడుదల చేసింది టీమ్. ఈ (Tiger Nageswara Rao) సినిమా కోసం రవితేజ లుక్ మాత్రం ఊహించని రేంజ్‌లో ఉందని చెప్పాలి. రవితేజ 71వ చిత్రంగా వస్తున్న టైగర్ కోసం రవితేజ సిక్స్ ప్యాక్ బాడీలో రాబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా రవితేజ సరసన నుపుర్ సనన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. నుపుర్ సనన్ (Nupur Sanon) విషయానికొస్తే.. ఈమె ప్రముఖ హీరోయిన్ కృతి సనన్ చెల్లెలు. మరో హీరోయిన్‌గా గాయత్రి భరద్వాజ్ నటిస్తున్నారు. ఇక  ‘టైగర్ నాగేశ్వరరావు’ విషయానికొస్తే.. రాబిన్ హుడ్ తరహా బందిపోటు దొంగ. తాను దోచుకున్న దాంట్లో పేదలకు సాయం చేస్తుండేవారు. అందుకే ఆయనకు ప్రజల్లో ఎంతో పేరుండేది. ఈయన్ని బ్రిటిష్ పట్టుకొని ఉరి తీశారు. ఓ రకంగా ఉన్నవాళ్లను దోచుకొని .. బీద సాదలకు పెట్టడం ఈయన్ని అందరు ముందుగా ‘టైగర్ నాగేశ్వరరావు’ అని పిలిచేవారు. అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

  Allari Naresh: అల్లరి నరేష్ టాలీవుడ్ కామెడీకి కేరాఫ్ అడ్రస్.. హీరోగా 20 యేళ్ల ప్రస్థానం..


  రవితేజ టైగర్‌తో పాటు మరో రెండు చిత్రాలను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటిస్తున్నారు. దీంతో పాటు రవితేజ కెరీర్‌లో 70వ సినిమాగా ‘రావణాసుర’ (Ravanasura) చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ramarao On Duty, Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు