హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్ అవుట్.. క్షణాల్లో వీడియో వైరల్

Ravi Teja: రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్ అవుట్.. క్షణాల్లో వీడియో వైరల్

Photo Credit: Twitter

Photo Credit: Twitter

Ramarao On Duty: చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్కటిగా వదులుతున్న అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్ పేరుతో ఓ పవర్‌ఫుల్ వీడియో వదిలారు.

మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) హీరోగా రాబోతున్న కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ. ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షక లోకం భారీ అంచనాలు పెట్టుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టిన ఆయన.. రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) అనే డిఫరెంట్ మూవీతో సూపర్ సక్సెస్ అందుకుంటారని అంతా నమ్ముతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కొక్కటిగా వదులుతున్న అప్‌డేట్స్ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్ పేరుతో ఓ పవర్‌ఫుల్ వీడియో వదిలారు మేకర్స్.

రామారావు ఆన్ డ్యూటీ మాస్ నోటీస్ అవుట్ అంటూ వదిలిన ఈ వీడియోను.. మీ ఆయన మెరుపు లాంటి వాడు. శబ్దం లేకుండా వెలుగునిచ్చేవాడు అనే డైలాగ్ తో ప్రారంభించి మాస్ ఫైట్ సీన్స్ తో ఆసక్తి రేకెత్తించారు. నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు.. నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని అని చెబుతూ రవితేజ పవర్ ఫుల్ సీన్స్ చూపించారు. దీంతో విడుదల చేసిన కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ అయింది. రవితేజ మాస్ అప్పీయరెన్స్ చూసి ఆయన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఇకపోతే రీసెంట్ గా విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షక లోకం నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ లోనే ఆల్ టైమ్ రికార్డ్ సొంతం చేసుకుంది. విడుదలైన 24 గంటల్లోనే 11 మిలియన్ల వ్యూస్ రాబట్టింది రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్. తద్వారా రవితేజ కెరీర్ లో ఇలా విడుదలైన 24 గంటల్లో ఇంతలా వ్యూస్ సంపాదించిన తొలి ట్రైలర్‌గా రికార్డు నమోదు చేసింది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్స్‌పై సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 29న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. 995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటివరకు వదిలిన అప్‌డేట్స్ చూస్తుంటే ఈ సినిమాతో రవితేజ మరోసారి బాక్సాఫీస్ దాడి చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది.

Published by:Sunil Boddula
First published:

Tags: Ramarao On Duty, Ravi Teja, Tollywood

ఉత్తమ కథలు