Home /News /movies /

RAVI TEJA RAMA RAO ON DUTY RELEASE DATE FIX SLB

Ravi Teja: రామారావు డ్యూటీకి ఎక్కేది అప్పుడే.. అఫీషియల్ స్టేట్‌మెంట్

Photo Twitter

Photo Twitter

Rama Rao On Duty Release Date: అయిదు పదుల వయసు దాటినా యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ముందుకెళ్తున్నారు రవితేజ. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకోగా తాజాగా రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు మేకర్స్.

ఇంకా చదవండి ...
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బాక్సాఫీస్ దాడి చేస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja). ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఆయన అయిదు పదుల వయసు దాటినా యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే రవితేజ హీరోగా చేసిన యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ (Ramarao On Duty) విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకోగా తాజాగా రామారావు ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు మేకర్స్.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్లపై శరత్ మండవ దర్శకత్వంలో ఈ రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) సినిమాను తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్నారు. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటించగా పవిత్ర లోకేష్, నాజర్, వేణు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.

అయితే రామారావుగా రవితేజ డ్యూటీ ఎక్కేందుకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో ప్రమోషన్స్ విషయంలో స్పెషల్ ప్లాన్స్ చేస్తున్నారట దర్శకనిర్మాతలు. రాబోయే రోజుల్లో భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్‌‌ నిర్వహించి మాస్ మహారాజ్ అభిమానులకు ఈ సినిమా విడుదలకు ముందే మంచి కిక్కివ్వాలని ప్లాన్ చేస్తున్నారట. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ఇతర అప్‌డేట్స్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకొని ఈ రామారావు ఆన్ డ్యూటీ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా కోసం రవితేజ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.



మరోవైపు ప్రస్తుతం ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వర రావు’, 'ధమాకా' సినిమాల్లో నటిస్తున్నారు రవితేజ. అదేవిధంగా ‘టైగర్ నాగేశ్వర రావు’ అనే మరో సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. స్టువర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ ఏడాది రవితేజ లైనప్ సినిమాలతో ఎంజాయ్ చేయడానికి ఆయన ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. సో.. చూడాలి మరి ఈ లైనప్ సినిమాల్లో ఏయే సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయి? ఏయే సినిమాలు డీలా పడతాయనేది!.
Published by:Sunil Boddula
First published:

Tags: Ravi Teja, Tollywood, Tollywood actor

తదుపరి వార్తలు