Home /News /movies /

RAVI TEJA PUTS PRABHAS PROJECT ASIDE AS THAT DEAL IS NOT SEALED MHN

Prabhas - Ravi Teja: ఆ విష‌యం తెగ‌లేదు.. ప్ర‌భాస్ సినిమాను ప‌క్క‌న పెట్టేసిన రవితేజ‌

Ravi Teja puts Prabhas project aside as that deal is not sealed

Ravi Teja puts Prabhas project aside as that deal is not sealed

Prabhas - Ravi Teja: ప్రభాస్‌కు సంబంధించిన యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో మారుతి డైరెక్టర్‌గా రవితేజతో సినిమా చేయడానికి చర్చలు జరిగాయి. అయితే రెమ్యునరేషన్‌ విషయంలో క్లారిటీ రాకపోవడంతో రవితేజ ఏం చేశాడో తెలుసా?

    మాస్ మ‌హారాజా ఇమేజ్ ఉన్న ర‌వితేజ‌.. ప్ర‌భాస్ సినిమాను ప‌క్క‌న పెట్టేయ‌డ‌మేంట‌ని అనుకోకండి. ఇక్క‌డే అస‌లు తిర‌కాసు ఉంది. ప్ర‌భాస్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్‌లో సైలెంట్ పార్ట్‌న‌ర్ అనే సంగ‌తి అందరికీ తెలిసిందే. త‌ను సినిమాలు చేస్తూనే ఇత‌ర హీరోల‌తో సినిమాలు నిర్మిస్తుంటాడు ప్ర‌భాస్‌. ఆయ‌న బ్యాన‌ర్‌లో ర‌వితేజ సినిమా చేయ‌డానికి రెడీ అయ్యాడు. డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా మారుతి. గ‌త ఏడాది ప్ర‌తిరోజూ పండ‌గే సినిమాతో సెన్సేష‌న‌ల్ హిట్‌ను ద‌క్కించుకున్నాడు మారుతి. ఈయ‌న ఓ లాయ‌ర్ క‌థ‌ను రాసుకున్నాడు. లాయ‌ర్ పాత్ర డ‌బ్బు కోసం ఎలాంటి కేసునైనా వాదిస్తుంటుంది. అందుక‌నే ఈ సినిమాకు మారుతి ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ అనే టైటిల్‌ను కూడా అనుకున్నాడు. ఈ పాత్ర‌కు ర‌వితేజ అయితే న్యాయం చేస్తాడ‌ని భావించిన మారుతి.. ముందుగా ర‌వితేజ‌ను క‌లిశాడు. ర‌వితేజ‌కు కూడా క‌థ బాగా న‌చ్చింది. కానీ అస‌లు తిర‌కాసు రెమ్యున‌రేష‌న్ ద‌గ్గ‌రే వ‌చ్చింది.

    సాధార‌ణంగా అయితే ర‌వితేజకు మామూలుగా తొమ్మిది కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌. కానీ ఈ సినిమాకు పన్నెండు కోట్ల రూపాయ‌లు కావాల‌ని డిమాండ్ చేశాడు. నిర్మాత‌లు రెండు, మూడు ద‌ఫాలు ర‌వితేజ‌తో చ‌ర్చ‌లు కూడా జ‌రిపారు. కానీ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ర‌వితేజ అస‌లు త‌గ్గ‌న‌ని చెప్పేశాడు. దాంతో ఏం చేయ‌లేక నిర్మాత‌లు ప్రాజెక్ట్ నుండి డ్రాప్ అయ్యార‌ట‌. ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇదే క‌థ‌ను మ‌రో హీరోతో చేయాల‌ని అనుకుంటున్నారు. ఆ హీరో ఎవ‌రో కాదు.. గోపీచంద్‌. ఈ హీరోకి యువీ క్రియేషన్స్‌తో మంచి అనుబంధం ఉంది. జిల్ వంటి సినిమాను కూడా గోపీచంద్ ఈ బ్యాన‌ర్‌లో చేశాడు. ప్ర‌భాస్‌తో మంచి రిలేష‌న్ కూడా ఉండ‌టంతో గోపీచంద్ కూడా ఓకే చెప్పాడ‌ట‌. డేట్స్ కేటాయించాల్సి ఉంది. డేట్స్ అడ్జ‌స్ట్ కాగానే సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుంద‌ని టాక్‌.



    ప్ర‌స్తుతం ర‌మేశ్ వ‌ర్మ సినిమా ఖిలాడి చిత్రీక‌ర‌ణ‌లో ర‌వితేజ బిజీ బిజీగా ఉన్నాడు. సినిమాలు చేయ‌డంలో ర‌వితేజ ఏ మాత్రం స్పీడు త‌గ్గించ‌డం లేదు. ఓ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో సినిమాకు ఓకే చెప్పేస్తున్నాడు. ఖిలాడి సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో సినిమా కోసం క‌థ వినే స‌మ‌యంలో డైరెక్ట‌ర్ మారుతి చెప్పిన క‌థ ర‌వితేజ‌కు బాగా న‌చ్చింది. అయితే రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను వ‌దులుకున్నాడు. ఇప్పుడు మ‌రో సినిమాను ట్రాక్ ఎక్కించ‌డానికి ర‌వితేజ సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
    Published by:Anil
    First published:

    Tags: Prabhas, Raviteja, UV Creations

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు