హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: రిస్క్ తీసుకుంటున్న రవితేజ.. ‘క్రాక్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత..

Ravi Teja: రిస్క్ తీసుకుంటున్న రవితేజ.. ‘క్రాక్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత..

Ravi Teja: ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఒక్క హిట్ వస్తే చాలు స్టార్ హీరోలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్‌తో గతంలో వచ్చిన ఫ్లాపుల తాలూకు చేదు జ్ఞాపకాలు కూడా చెరిగిపోతాయి. రవితేజ విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది.

ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా ఒక్క హిట్ వస్తే చాలు స్టార్ హీరోలకు ఎలాంటి ఢోకా ఉండదు. ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్‌తో గతంలో వచ్చిన ఫ్లాపుల తాలూకు చేదు జ్ఞాపకాలు కూడా చెరిగిపోతాయి. రవితేజ విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరుగుతుంది. 2017లో వచ్చిన రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకు వరస ఫ్లాపులు వచ్చాయి. టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ కూడా అందుకోలేకపోయాయి. దాంతో రవితేజ పని అయిపోయింది.. మళ్లీ సైడ్ కారెక్టర్స్ చేసుకోవాల్సిందే అనే విమర్శలు కూడా వచ్చాయి. కానీ అన్నింటినీ ఒకే ఒక్క సినిమాతో వెనక్కి నెట్టేసాడు మాస్ రాజా. తనకు ఉన్న మార్కెట్ గురించి.. తన క్రేజ్‌పై వస్తున్న అనుమానాల గురించి క్రాక్ సినిమాతో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 50 శాతం ఆక్యుపెన్సీతోనే 38 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. 18 కోట్ల బిజినెస్ మాత్రమే చేసిన క్రాక్.. 20 కోట్లకు పైగా లాభాలు తీసుకొచ్చింది. బయ్యర్లకు లాభాల పంట పండించాడు మాస్ రాజా. దాంతో రవితేజ కెరీర్‌కు మళ్లీ రెక్కలొచ్చాయి.. కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ఈయన ప్రస్తుతం ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు. రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. మే 28న సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఖిలాడి తర్వాత మాస్ రాజా ఓ కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.

ravi teja,ravi teja twitter,ravi teja new director,ravi teja gulabi srinu new director,ravi teja krack movie,ravi teja khiladi movie,telugu cinema,రవితేజ,రవితేజ కొత్త దర్శకుడు,రవితేజ గులాబి శ్రీను,తెలుగు సినిమా
‘ఖిలాడి’గా రవితేజ (Twitter/Photo)

కెరీర్‌లో చాలా మంది కొత్త వాళ్లకు ఛాన్సులు ఇచ్చాడు రవితేజ. ఆయన చేతుల మీదుగానే శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని, బాబీ, హరీష్ శంకర్, బోయపాటి శ్రీను లాంటి దర్శకులు పరిచయం అయ్యారు. ఇప్పుడు వాళ్లంతా స్టార్ డైరెక్టర్స్ అయిపోయారు. ఇక తాజాగా గులాబీ శ్రీను అనే దర్శకుడిని పరిచయం చేయబోతున్నాడు రవితేజ. ఈయన చెప్పిన కథ నచ్చడంతో మాస్ రాజా ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. కాటమ రాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసాడు గులాబీ శ్రీను.

ravi teja,ravi teja twitter,ravi teja new director,ravi teja gulabi srinu new director,ravi teja krack movie,ravi teja khiladi movie,telugu cinema,రవితేజ,రవితేజ కొత్త దర్శకుడు,రవితేజ గులాబి శ్రీను,తెలుగు సినిమా
క్రాక్ సినిమా పోస్టర్ (Krack movie poster)

అలాగే క్రాక్ సినిమాకు కూడా గోపీచంద్ మలినేని దగ్గర అసిస్టెంట్‌గా చేసాడు ఈయన. ఏడాది కిందే మాస్ రాజాకు కథ చెప్పడం.. గతేడాది నుంచి రవితేజ కూడా కథలో కొన్ని మార్పులు చేర్పులు చెప్పడం అన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్యే దర్శకుడు ఫైనల్ నెరేషన్ ఇవ్వడంతో రవితేజ కూడా ఖిలాడి తర్వాత ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాడు. ఏదేమైనా కూడా క్రాక్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఇప్పుడు కొత్త దర్శకుడితో సినిమా అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్న పనే.

First published:

Tags: Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు