హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja - Dhamaka : విజయ దశమి రోజున రవితేజ ‘ధమాకా’.. అదిరిన మాస్ మహారాజ్ కొత్త టైటిల్..

Ravi Teja - Dhamaka : విజయ దశమి రోజున రవితేజ ‘ధమాకా’.. అదిరిన మాస్ మహారాజ్ కొత్త టైటిల్..

రవితేజ ‘ధమాకా’ (Twitter/Photo)

రవితేజ ‘ధమాకా’ (Twitter/Photo)

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ ఈ యేడాది ‘క్రాక్’ (Krack) మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021లో తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తాజాగా రవితేజ ‘ధమాకా’ అంటూ విజయ దశమి సందర్భంగా కొత్త సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు.

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ ఈ యేడాది ‘క్రాక్’ (Krack) మూవీతో బోణీ చేసారు. ఈ సినిమా 2021లో తొలి హిట్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కరోనా నేపథ్యంలో సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా అనే దానికి పులిస్టాప్ పెడుతూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొట్టింది. అంతేకాదు ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్‌తో గోపీచంద్ మలినేని (Gopichand Malineni) తో రవితేజ హాట్రిక్ హిట్ నమోదు చేసారు. ఆ సంగతి పక్కనపెడితే.. రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

ఈ సినిమాలో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో నటిస్తోంది. మరోవైపు యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.

రవితేజ ‘ధమాకా’(Twitter/Photo)

‘ఖిలాడి’  సినిమా సెట్స్ పై ఉండగానే రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు ఆన్ డ్యూటీ అనేది ట్యాగ్ లైన్. ఈయన లండన్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి పలు తెలుగు, తమిళ చిత్రాలకు రచయతగా పనిచేశారు.ఈ సినిమాలో రవితేజ సరసన .. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.

ఇక అది అలా ఉంటే మరోవైపు రవితేజ మరో సినిమాను లైన్‌లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలుబడింది. విజయ దశమి సందర్భంగా ఈ సినిమాకు ‘ధమాకా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘డబుల్ ఇంపాక్ట్’ అనేది ట్యాగ్ లైన్. దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.


‘Having A Blasting’ అనే కింద పోస్టర్‌లో చూపించారు. ఇప్పటికే అక్టోబర్ 4 న ఈ సినిమా షూటింగ్ ప్రారంభించారు.  ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

First published:

Tags: Dhamaka, Khiladi Movie, Rama Rao, Ravi Teja, Trinadha Rao Nakkina

ఉత్తమ కథలు