Ravi Teja: రవితేజ దూకుడు మాములుగా లేదుగా.. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాకు ఓకే చెబుతున్నారు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వారం రోజుల షూట్ చేస్తే ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయవచ్చు. ఈ సినిమాలో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. అనసూయ మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఇటలీ కొంత భాగం షూటింగ్ చేసుకుంది. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఐతే.. చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాతో పాటు రవితేజ.. శరత్ మండవ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు.
ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ఈ సినిమాకు కొబ్బరికాయ కొట్టరు రవితేజ. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌లో రవితేజ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. అదే రోజుల ప్రధాన తారాగణంపై కొన్ని సన్నివేశాలను పిక్చరైజ్ చేస్తున్నారట. ఈ చిత్రంలో రవితేజ సరసన మరోసారి ఇద్దరు భామలకు ఛాన్స్ ఉందట.ఇందులో ఒక హీరోయిన్‌గా దివ్యాంశ కౌశిక్‌ను ఎంపిక చేసారు. మరో కథానాయిక కోసం అన్వేషణ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 1990 కాలం నాటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కించనున్నారు.
ఈ సినిమాలో రవితేజ ఒక ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారు. శరత్ మండవ విషయానికొస్తే.. ఈయన పలు చిత్రాలకు మాటల రచయతగా పనిచేసారు. ఈ సినిమాకు స్యామ్ సీఎస్ స్వరాలు అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మరోవైపు రవితేజ.. బోయపాటి శ్రీనుతో సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. మొత్తంగా క్రాక్ హిట్‌తో రవితేజ దూకుడు మాములుగా లేదుగా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khiladi Movie, Ravi Teja, Tollywood