‘డిస్కోరాజా’ కోసం రవితేజ మేకోవర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

వరస ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. ఇప్పుడు ‘డిస్కో రాజా’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. దీనికోసం మాస్‌రాజా బాగానే వర్కౌట్ చేసి తన లుక్‌ను మార్చుకున్నాడు.

news18-telugu
Updated: August 24, 2019, 12:32 PM IST
‘డిస్కోరాజా’ కోసం రవితేజ మేకోవర్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
’డిస్కోరాజా’లో రవితేజ
  • Share this:
వరస ఫ్లాపులు వ‌స్తున్నా కూడా ర‌వితేజ జోరు మాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌ర‌స సినిమాల‌తో స‌త్తా చూపిస్తున్నాడు. గతేడాది "ట‌చ్ చేసి చూడు".. "నేల‌టికెట్".. "అమర్ అక్బర్ ఆంటోనీ" సినిమాల‌తో వ‌చ్చాడు మాస్ రాజా. "రాజా ది గ్రేట్"తో రెండేళ్ల త‌ర్వాత వ‌చ్చి హిట్ కొట్టిన ఈ హీరో.. ఆ త‌ర్వాత మాత్రం అదే టెంపో కొన‌సాగించ‌లేక‌పోయాడు. ఈయన సినిమాలు కనీసం 10 కోట్ల మార్క్ అందుకోలేక చేతులెత్తేస్తున్నాయి. ఇక ఇప్పుడు ‘డిస్కో రాజా’ సినిమాతో వస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమాలో రవితేజ రెండు షేడ్స్ వున్న పాత్రలు చేస్తున్నట్టు సమాచారం. అందులో ఒక పాత్ర కోసం రవితేజ.. మరి యంగ్‌గా కనిపించాలి. దీనికోసం మాస్‌రాజా బాగానే వర్కౌట్ చేసి తన లుక్‌ను మార్చుకున్నాడు. మీసాలు ట్రిమ్ చేసి.. కాస్తంత స్లిమ్ అయ్యాడు.

ravi teja new look for disco raja movie go viral on social media,raviteja,ravi teja,ravi teja disco raja,ravi teja make over for disco raja movie,Ravi teja vi anand movie,Ravi teja vi anand disco raja movie,Ravi teja vi anand disco raja movie motion poster release,Ravi teja vi anand movie disco raja,ravi teja nabha natesh,ravi teja payal rajput,ravi teja priyanka jawalkar,ravi teja vi anand movie ram talluri,Amar Akbar Antony, vi anand,ss thaman,three heroines,nabha natesh,okka kshanam,ekkadiki pothavu chinnavada,nikhil,allu shirish,First Look, Srinu, Vaitla, Mythri Movie Makesr, Tollywood News, రవితేజ విఐ ఆనంద్ సినిమా,రవితేజ నభా నటేష్,రవితేజ పాయల్ రాజ్‌పుత్,రవితేజ ప్రియాంక జవాల్కర్,టాక్సీవాలా ప్రియాంక జవాల్కర్ రవితేజ,రవితేజ, ముగ్గురు హీరోయిన్లు. విఐ ఆనంద్,డిస్కోరాజా, నభా నటేష్, టాలీవుడ్ న్యూస్, మైత్రీ మూవీ మేకర్స్, శ్రీనువైట్ల, థమన్, అమర్ అక్బర్ ఆంటోని, ఫస్ట్ లుక్, ఇలియానా,రవితేజ మేకోవర్,రవితేజ కొత్త లుక్,
‘డిస్కోరాజా’ కోసం కొత్త లుక్‌లో రవితేజ


వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న  ఈ సినిమా  కొరియా సినిమాకు స్పూర్తి అని చెబుతున్నారు. కథ ప్రకారం ఈ సినిమాలో రవితేజ వృద్దుడిగా కనిపిస్తాడట. ఆ తర్వాత తన శతృవులపై రివేంజ్ తీర్చుకోవడం కోసం యువకుడిగా మారిపోతాడట. వృద్దుడిగా ఉన్న మాస్ రాజా..ఎలా యువకుడిగా మారాడనేదే ఈ సినిమా స్టోరీ అని చెబుతున్నారు. మొత్తానికి రొటిన్ నటన, అదే ఫేస్‌కట్‌తో బోర్ కొట్టించిన రవితేజ.. ఇపుడు డిస్కోరాజా కోసం కాస్తంత మారాడనే చెప్పాలి.

‘డిస్కోరాజా’లో రవితేజ సరసన నటిస్తోన్న భామలు (ఫైల్ ఫోటో)


ఇందులో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, ప్రియాంక జువాల్కర్   హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. "నేల‌టికెట్" నిర్మాత రామ్ త‌ల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.త‌న కెరీర్‌లో ఇప్పటి వ‌ర‌కు చేయ‌ని ఓ కొత్త జోన‌ర్‌లో ఈ చిత్రం ట్రై చేస్తున్నాడు ర‌వితేజ‌. సైన్స్ ఫిక్షన్ కథగా ఇది వస్తుంది. మ‌రోసారి థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కార్తిక్ ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫ‌ర్. ఇదే ఏడాది విడుద‌ల కానుంది ఈ చిత్రం. మ‌రి చూడాలిక‌.. ముగ్గురు హీరోయిన్ల‌తో డిస్కోరాజాగా మాస్ రాజా చేయ‌బోయే రొమాన్స్ ఎలా ఉండ‌బోతుందో చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 24, 2019, 12:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading