Home /News /movies /

RAVI TEJA MOVIE RAMA RAO ON DUTY TWITTER REVIEW SB

Ramarao on Duty:రామారావు అన్ డ్యూటీ ట్విట్టర్ రివ్యూ.. ఫస్టాప్ ఇలా.. సెకండాఫ్ అలా..!

రామారావు అన్ డ్యూటీ

రామారావు అన్ డ్యూటీ

ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ శరత్ మందవ చాలా సమయం తీసుకున్నాడని సినిమా చూసిన వాళ్లు కామెంట్లు పెడుతున్నారు.

    మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ' జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లో రిలీజ్ అయ్యింది. రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్ సహా ఇండియాలోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమాకు ఊహించని విధంగా మిక్స్‌డ్‌ టాక్ వచ్చింది. ఈ మూవీ బాగుందని కొందరు, పర్వాలేదని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి సిఐ మురళి పాత్రలో కనిపించనున్నారు. చాలా కాలం తర్వాత వేణు ఈ చిత్రంతోనే రీఎంట్రీ ఇస్తున్నారు

    ఇక 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి డైరెక్టర్ శరత్ మందవ చాలా సమయం తీసుకున్నాడట. పాత్రలను పరిచయం చేయడం.. సాంగ్స్‌కు ఎక్కువ సమయం తీసుకున్నాడట. అయితే, సెకెండాఫ్ మాత్రం మిస్టరీ కేసును చేదించే సీన్లతో పాటు రవితేజ మార్క్ మాస్ సీక్వెన్స్‌లు అదిరిపోయేలా వచ్చాయని టాక్. కొందరు నెటిజన్లు బ్లాక్ బస్టర్ మూవీ అని ట్వీట్లు పెడుతున్నారు.



    'రామారావు ఆన్ డ్యూటీ' మూవీని చూసిన వాళ్లంతా చేసిన ట్వీట్ల ప్రకారం.. ఇందులో రవితేజ వన్ మ్యాన్ షో చేశాడట. అలాగే, బ్యాగ్రౌండ్ స్కోర్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్, క్లైమాక్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ఉన్నాయని అంటున్నారు. అయితే, కామెడీ లేకపోవడం, థ్రిల్ మిస్ అవడం, లాజిక్ లేని సీన్లు, పాటల టైమింగ్ మిస్ అవడం ఈ సినిమాకు మైనస్‌గా మారాయని అంటున్నారు.





    తాజా సమాచారం ప్రకారం.. రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ ఇన్వెస్టిగేటివ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని తెలుస్తోంది. ఇందులో రవితేజ మార్కు మాస్ యాక్షన్‌తో సన్నివేశాలు ఫుల్ ఉన్నాయి . అయితే, ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లకు  వెళ్లే వాళ్లకు మాత్రమే ఈ సినిమా నచ్చుతుందని తెలుస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చతుందని అంటున్నారు.





    మరికొందరు రామారావు అన్ డ్యూటీలో డబ్బింగ్ సరిగా లేదని కొందరు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అంటే హీరో డైలాగ్ చెప్పేటప్పుడు లిప్ సింక్ అవడం లేదట. ఇది ఈ సినిమాలో గమనించిన వారికి ఇబ్బంది కలిగించేలా ఉందని అంటున్నారు. ఈ సమస్యను చిత్ర యూనిట్ ఏం చేస్తుందో చూడాలి.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Rama Rao On Duty, Ravi Teja, Tollywood

    తదుపరి వార్తలు