హోమ్ /వార్తలు /సినిమా /

Dhamaka: రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ అదుర్స్.. ఆకట్టుకుంటున్న ధమాకా రొమాంటిక్ గ్లింప్స్.. !

Dhamaka: రవితేజ, శ్రీలీల కెమిస్ట్రీ అదుర్స్.. ఆకట్టుకుంటున్న ధమాకా రొమాంటిక్ గ్లింప్స్.. !

ధమాకా నుంచి రొమాంటిక్ గ్లింప్స్

ధమాకా నుంచి రొమాంటిక్ గ్లింప్స్

తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా ఆకట్టుకుంది. ఇక మేకర్స్ అయితే ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుందో అనే దానికి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు ధమాకా టీం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ధమాకా. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్పెయిన్‌లో మొదలైంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేసారు. గతంలో నాలుగు షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేసుకుంది.తాజాగా వినాయక చవితి సందర్భంగా మేకర్స్ ఈ రోజు ఒక ప్రత్యేక రొమాంటిక్ గ్లింప్స్ ను విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో చాలా అందంగా ఉంది. ఈ వీడియో చూస్తే.. పెళ్లి జరుగుతుంటే... రవితేజ, శ్రీలీలా రొమాన్స్ చేస్తూ కనిపించారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంది. ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ స్కూర్ కూడా అదిరిపోయింది. ఇక ఈ ప్రోమోలో రవితేజ యంగ్‌గా కనిపిస్తుండగా, శ్రీలీల అందంగా కనిపిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా ఆకట్టుకుంది. ఇక మేకర్స్ అయితే ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుందో అనే దానికి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగానే... ఈ గ్లింప్స్‌ను ఆగస్ట్ 31న సాయంత్రం 5 గంటల 1 నిమిషానికి రిలీజ్ చేసింది ధమాకా టీం. మరి ఈ పోస్టర్ లో అయితే హీరోయిన్ శ్రీ లీల తో రవితేజ కెమిస్ట్రీ మరింత ఆసక్తిగా కనిపిస్తుంది.
    ఇక “బెంగాల్ టైగర్” కి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.


    ఇక రవితేజ విషయానికి వస్తే మన మాస్ మహారాజ్ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ యేడాది రవితేజ ‘ఖిలాడి’ మూవీతో పలకరించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. ‘ఖిలాడి’ సినిమా రవితేజ వరుస సినిమాలతో పలకరించారు. ఇటీవలే రవితేజ రామారావు ఆన్ డ్యూటీ.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.
    రవితేజ ధమాకాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి (Ravanasura) రావ‌ణాసుర టైటిల్‌ను ఫైన‌ల్ చేశారు. ఈ సినిమాలో ర‌వితేజ లుక్ ఇప్ప‌టికే విడుద‌ల‌వ‌్వగా తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి అయ్యినట్లు చిత్రబృందం ప్రకటించింది.

    Published by:Sultana Shaik
    First published:

    Tags: Dhamaka, Ravi Teja, Sreeleela

    ఉత్తమ కథలు