హోమ్ /వార్తలు /సినిమా /

Dhamaka: రవితేజ ధమాకా నుంచి రేపు సాలిడ్ అప్ డేట్... బీ రెడీ ..!

Dhamaka: రవితేజ ధమాకా నుంచి రేపు సాలిడ్ అప్ డేట్... బీ రెడీ ..!

ఇప్పటికే ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. అందులో రవితేజ ధమాకా కూడా ఉంది. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటి వరకు కమిటైన సినిమాలను పక్కనబెడితే.. ఇప్పట్నుంచి కమిట్ అయ్యే సినిమాలకు మాత్రం కోటి వరకు డిమాండ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. అందులో రవితేజ ధమాకా కూడా ఉంది. దాంతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తుంది ఈ బ్యూటీ. ఇప్పటి వరకు కమిటైన సినిమాలను పక్కనబెడితే.. ఇప్పట్నుంచి కమిట్ అయ్యే సినిమాలకు మాత్రం కోటి వరకు డిమాండ్ చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక (Dhamaka) ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక “బెంగాల్ టైగర్” కి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మాస్ మహారాజ్ రవితేజ 2021లో ‘క్రాక్’ మూవీతో బోణీ చేసారు. ఈ యేడాది రవితేజ ‘ఖిలాడి’ మూవీతో పలకరించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. ‘ఖిలాడి’ సినిమా రవితేజ వరుస సినిమాలతో పలకరించారు. ఇటీవలే రవితేజ రామారావు ఆన్ డ్యూటీ.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న మరో చిత్రం “ధమాకా” (Dhamaka). తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్పెయిన్‌లో మొదలైంది. దీనికి సంబంధించి పోస్టర్‌ను విడుదల చేసారు. గతంలో నాలుగు షెడ్యూల్స్‌ను కంప్లీట్ చేసుకుంది.


  తాజాగా ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ కూడా ఆకట్టుకుంది. ఇక మేకర్స్ అయితే ఈ సినిమా అసలు ఎలా ఉండబోతుందో అనే దానికి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ గ్లింప్స్ ని రేపు ఆగస్ట్ 31న సాయంత్రం 5 గంటల 1 నిమిషానికి రిలీజ్ చేస్తున్నట్టుగా ధమాకా టీం సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మరి ఈ పోస్టర్ లో అయితే హీరోయిన్ శ్రీ లీల తో రవితేజ కెమిస్ట్రీ మరింత ఆసక్తిగా కనిపిస్తుంది.  ఇక (Dhamaka) ఈ సినిమాలో పెళ్లి సందD హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక “బెంగాల్ టైగర్” కి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ ఫిల్మ్, పిపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  రవితేజ ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన దర్శకుడు సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ చిత్రానికి (Ravanasura) రావ‌ణాసుర టైటిల్‌ను ఫైన‌ల్ చేశారు. ఈ సినిమాలో ర‌వితేజ లుక్ ఇప్ప‌టికే విడుద‌ల‌వ‌్వగా తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి అయ్యినట్లు చిత్రబృందం ప్రకటించింది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు