RAVI TEJA MOTHER POLICE CASE FILE AGAINST RAVI TEJA MOTHER BHUPATHI RAJYA LAKSHMI TA
Ravi Teja : హీరో రవితేజ తల్లిపై పోలీసు కేసు నమోదు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
రవితేజ తల్లిపై కేసు నమోదు (Twitter/Photo)
Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja ) కుటుంబం మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మీపై ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
Ravi Teja : మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja ) కుటుంబం మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. గతంలో రవితేజతో పాటు ఆయన తమ్ముళ్లపై డ్రగ్స్ కేసు సహా, రాష్ డ్రైవింగ్ సహా పలు కేసులతో రవితేజ కుటుంబం వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఆయన తల్లిగారైన భూపతి రాజ్యలక్ష్మితో పాటు మర్రిపాకు చెందిన సంజయ్ అనే వ్యక్తిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్ప గోదావరి జిల్లా జగ్గంపేట మండలానికి చెందిన రామవరం వద్ద ఉన్న సర్వే నంబర్ 108, 124లో పుష్కర కాలువ, స్లూయజ్ నిర్మాణ పనులను రవితేజ తల్లి భూపతి రాజ్యలక్ష్మితో పాటు సంజయ్ అనే వ్యక్తి కలిసి ధ్వంసం చేశారంటూ పోలీసు కేసు ఫైల్ చేశారు.
ప్రభుత్వ అధికారుల పర్మిషన్ లేకుండా వీళ్లిద్దరు కలిసి గవర్నమెంట్‌కు చెందిన ఆస్తులని విధ్వంసం సృష్టింరంటూ పోలీసులు తమ నివేదికలో తెలిపారు. ఈ కోవలోనే రవితేజ తల్లిగారైన భూపతి రాజ్యలక్ష్మీ(Bhupathi Rajya Lakshmi) తో పాటు సంజయ్ పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం రవితేజ మదర్.. తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విషయమై రవితేజ ఇంత వరకు రెస్పాండ్ కాలేదు.
ప్రస్తుతం రవితేజ విషయానికొస్తే.. ఈయన ఖిలాడి’ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ’క్రాక్’ తర్వాత ఈ సినిమా రావడంతో ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక తాజాగా ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది.ఈ సినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. అదే డేట్ విడుదల చేస్తారా లేదా అనేది జనవరి 26న తేలిపోనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
‘ఖిలాడి’ సినిమాతో పాటు రవితేజ మూడు నాలుగు చిత్రాలను లైన్లో పెట్టారు. ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ధమాకా అనే సినిమా చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల నటించనుందని టాక్.ఈ సినిమాతో పాటు రవితేజ తన 68వ సినిమాగా ‘రామారావు’ (Raviteja Ramarao On Duty) అనే చిత్రాన్ని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీని మార్చి 25న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో పాటు ‘రావణాసుర’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రవితేజ.. చిరంజీవి, బాబీ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.