హోమ్ /వార్తలు /సినిమా /

రవితేజ చేతుల మీదుగా అధర్వ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ రిలీజ్

రవితేజ చేతుల మీదుగా అధర్వ టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ రిలీజ్

Adharva (Photo Twitter)

Adharva (Photo Twitter)

Atharvra: క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ అధర్వ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ హీరో రవితేజ విడుదల చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

యువ హీరో కార్తీక్ రాజు (Karthik Raju) ప్రధాన పాత్రలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా అధర్వ (Atharvra). క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ సినిమాకు మహేష్ రెడ్డి (Mahesh Reddy) దర్శకత్వం వహిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.


ఈ నేపథ్యంలో తాజాగా మాస్ మహారాజా రవితేజ (Ravi teja) చేతుల మీదుగా ఈ సినిమా తెలుగు టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ విడుదల చేశారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్.. అంటూ హీరో చెబుతున్న డైలాగ్స్ ఈ మోషన్ పోస్టర్‌ లో హైలైట్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ అట్రాక్షన్ గా నిలిచింది. అతి చిన్న వీడియోతోనే సినిమాపై ఆసక్తి పెంచేశారు మేకర్స్. అధర్వ అంటూ పడిన టైటిల్ బోల్డ్ నలుపు అక్షరాలతో వ్రాయబడి ఉండగా, మధ్య పదం మాత్రం DNA రేఖాచిత్రంతో ఎరుపు రంగులో పెయింట్ చేయబడటం సినిమాలో ఉన్న వైవిధ్యాన్ని బయటపెడుతోంది.


ది సీకర్ ఆఫ్ ది ట్రూత్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే ఈ సినిమా డిఫరెంట్ అనుభూతి కలిగిస్తుందని తాజాగా వదిలిన మోషన్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. అదేవిధంగా డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. ఆయన మ్యూజిక్ సినిమాకు మేజర్ అసెట్ అంటున్నారు మేకర్స్.


ఈ సినిమాకు చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చిత్రంలో సిమ్రాన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Ravi Teja, Tollywood, Tollywood Cinema

ఉత్తమ కథలు