హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja Krack Digital Release : రవితేజ బ్లాక్‌బస్టర్ సినిమా క్రాక్ డిజిటల్ రైట్స్ ఎవరు దక్కించుకున్నారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు..

Ravi Teja Krack Digital Release : రవితేజ బ్లాక్‌బస్టర్ సినిమా క్రాక్ డిజిటల్ రైట్స్ ఎవరు దక్కించుకున్నారు.. స్ట్రీమింగ్ ఎప్పుడు..

రవితేజ క్రాక్ (Ravi Teja Krack)

రవితేజ క్రాక్ (Ravi Teja Krack)

Ravi Teja Krack Digital Release : టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మసాలా ఎంటర్టైనర్ క్రాక్.

  టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన మాస్ మసాలా ఎంటర్టైనర్ క్రాక్. ఎన్నో అడ్డంకుల నడుమ విడుదలైన ఈ సినిమా సంక్రాంతి వాటిని అన్నింటిని దాటుకుంటూ ఇప్పుడు భారీ హిట్ దిశగా ముందుగు సాగుతోంది. ఈ సినిమా రవితేజ మరోసారి పూర్వవైభవం తెచ్చిందని అంటున్నారు. సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. కానీ రవితేజ మాస్ మసాల యాక్షన్ క్రాక్ మాత్రం కావాల్సినంత ఎంటర్ టైన్‌మెంట్‌ను ఇస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. మాస్టర్ లాంటీ తమిళ సినిమాలను, రెడ్, అల్లుడు అదుర్స్ లాంటీ తెలుగు సినిమాలను పక్కకు నెట్టివేస్తూ ముందుకుసాగుతోందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఇక అది అలా ఉంటే ఈ సినిమా డిజిటల్ హక్కులు ఎవరు దక్కించుకున్నారని మరో టాక్ నడుస్తోంది. ఎందుకంటే.. ఈ చిత్రం స్క్రీనింగ్ సమయంలో కూడా ఎక్కడా కనిపించలేదు. మరి దీనితో ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు అమ్ముడు పోయాయా లేదా అమ్మడు పోతే ఎవరు కొన్నట్లు అని చర్చించుకుంటున్నారు రవితేజ ఫ్యాన్స్.

  ఈ విషయంలో లేటెస్ట్ టాక్ ప్రకారం క్రాక్ స్ట్రీమింగ్ హక్కులను అల్లు అరవింద్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ “ఆహా” క్రాక్‌ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక క్రాక్ స్ట్రీమింగ్ విషయానికి వస్తే.. మామాలుగా అయితే ఓ సినిమా విడుదలైన యాబైరోజుల తర్వాత డిజిటల్‌లో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఇది కూడా సినిమా సినిమాను బట్టి మారుతుంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

  Krack Movie First Day Collections Ravi Teja Got Good Opening Collections, Krack Movie First Day Collections:రవితేజ ’క్రాక్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ దగ్గర మాస్ మహారాజ్ మేనియా..,Krack Movie First Day Collections ,Krack Movie Collections,Krack Movie Box Office Collections,Krack First Day Collections,Krack Movie First Day box Office Collections Krack Movie Review,Krack Movie Twitter Review,Krack Twitter Review,Ravi Teja, Krack,Ravi Teja Krack Movie Censor Completed,Karck Movie U/A Certificate, Movie Trailer released, Krack Movie,Ravi Teja Krack,Krach Movie Release Date,Krack movie teaser,Krack movie teaser release,ravi teja,ravi teja twitter,ravi teja krack movie,gopichand malineni ravi teja,ravi teja movies,telugu cinema,రవితేజ,రవితేజ క్రాక్,క్రాక్ సినిమా టీజర్,రవితేజ క్రాక్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు,క్రాక్ మూవీ విడుదల తేదీ ఖరారు,Raviteja Khiladi, Venkatesh ,Raviteja films, sharath kumar,Pranitha Subhash pics, pranitha hot yoga,pranitha hot,pranitha fb,pranitha facebook,pranitha insta,pranitha instagram,pranitha twitter,pranitha size,pranitha age, ప్రణీత హాట్ అందాలు, ప్రణీత హాట్,ప్రణీత,క్రాక్ సెన్సార్ పూర్తి,క్రాక్ మూవీ రివ్యూ,క్రాక్ మూవీ ట్విట్టర్ రివ్యూ,,క్రాక్ ఫస్ట్ డే కలెక్షన్స్,క్రాక్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్, రవితేజ క్రాక్ మూవీ కలెక్షన్స్,
  రవితేజ క్రాక్ పోస్టర్ (Ravi Teja Krack poster)


  ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. రవితేజ ఈ సినిమాలో తన మాస్ విశ్వరూపమే చూపించాడని అంటున్నారు ఫ్యాన్స్. రవితేజ పోతురాజు వీర శంకర్‌గా అదరగొట్టాడు. ఇక ఇతర పాత్రల్లో సీనియర్ నటులు సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ కూడా కేక పెట్టించారు. ఇక ఇదే కాంబినేషన్‌లో గతంలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్లు వచ్చి.. అదరగొట్టడడంతో ఈ సారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అయ్యిందని భావిస్తున్నారు రవితేజ అభిమానులు. బి.మధు నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.


  క్రాక్ సినిమా తర్వాత రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మ విషయానికి వస్తే ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఆ మధ్య రాక్షసుడు అనే సినిమాను తీసి మంచి విజయాన్ని పొందాడు. తమిళ రాచసన్ అనే సినిమాకు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాతో బెల్లంకొండ చాలా సంవత్సరాల తర్వాత మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక రమేష్ వర్మ ఇదే ఊపులో రవితేజకు మరో మంచి విజయాన్ని అందించనున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. ఇక ఇదే కాంబినేషన్’లో 2011లో వీర వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Raviteja, Tollywood news

  ఉత్తమ కథలు