Home /News /movies /

RAVI TEJA KRACK TO RELEASE IN A POPULAR OTT HERE ARE THE DETAILS SR

Telugu OTT : ఓటీటీలో విడుదలకానున్న రవితేజ కొత్త సినిమా..

రవితేజ Photo : Twitter

రవితేజ Photo : Twitter

Telugu OTT : ఇప్పటికే తెలుగులో అమృతరామమ్, కీర్తి సురేష్ పెంగ్విన్, తాజాగా కృష్ణ అండ్ హిజ్ లీలా, బానుమతి అండ్ రామకృష్ణ విడుదలై పరువాలేదనిపించాయి.

    కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్ డౌన్‌తో సినిమా  షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. అంతేకాకుండా థియేటర్స్ కూడా మూత పడ్డాయి. ఈ లాక్ డౌన్ ఎప్పటివరకు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. ఒకవేళా లాక్ డౌన్ తొలగించిన కూడా జనాలు సినిమా థియేటర్స్‌కు వచ్చి సినిమా చూసే పరిస్థితి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అయితే ఓ సినిమా అనుకున్న సమయానికి విడుదల కాకపోతే తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సీ వస్తుంది. దీంతో ఈ నష్టాల నుంచి.. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలా అని ఫిలిం మేకర్స్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుంజుకున్నాయి. ఈ లాక్ డౌన్ కారణంగా ఓటీటీ సంస్థలకు భారీగా సబ్ స్క్రైబర్ల సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు అంతకుమించిన భారీ వ్యూయర్ షిప్ అందుతోంది. ఈ సంస్థలు కూడా ఓ సినిమాకు మంచి ఆదరణ ఉంటుందని భావిస్తే మంచి ఆఫర్‌ను నిర్మాత ముందుంచుతున్నారు. అందులో భాగంగా తెలుగులో ప్రస్తుతం చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చే ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మధ్య నాని నటించిన వి, రామ్ హీరోగా వస్తోన్న రెడ్, అనుష్క ప్రధాన పాత్రలో వస్తోన్న నిశ్శబ్దం సినిమాలు ఓటీటీలో విడుదలకానున్నాయని టాక్ నడిచింది. కానీ విడుదలకాలేదు.

    అయితే ఇప్పటికే తెలుగులో అమృతరామమ్, ఆ తర్వాత కీర్తి సురేష్ పెంగ్విన్, తాజాగా కృష్ణ అండ్ హిజ్ లీలా, బానుమతి అండ్ రామకృష్ణ విడుదలై పరువాలేదనిపించాయి. అయితే ఇప్పటి వరకు ఓటీటీలో అన్నీ చిన్న సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. నిశ్శబ్దం, V లాంటి పెద్ద సినిమాల కోసం ఓటీటీలు ప్రయత్నించినప్పటికీ బడ్జెట్ అడ్డంకుల వల్ల సాధ్యం కాలేదు. అలా బడా హీరోల సినిమాలు లేకుండానే చిన్న సినిమాలకు పరిమితమైంది ఓటీటీ. ఈ నేపథ్యంలో తెలుగులో తొలి ఓటీటీ బడా మూవీగా రవితేజ క్రాక్ కానుంది. రవితేజ శృతిహాసన్ ప్రధాన పాత్రల్లో గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయకుండా నేరుగా ఓటీటీకి ఇవ్వాలని ఆలోచన చేస్తోంది చిత్రబృందం. అందులో భాగంగా ఈ సినిమా నిర్మాత ఠాగూర్ మధు కొన్ని ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు జరిపాడని.. అంతేకాదు ఓ సంస్థతో ఒప్పందం కుదిరినట్టు టాక్ వినిపిస్తోంది.

    ఈ హవా హిందీలోను కూడా కనపడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'లక్ష్మీ బాంబ్' చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేయనున్నారు. ఈద్ సందర్భంగా మే 22న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావించినప్పటికీ ఈ కరోనా వల్ల అది సాధ్యపడేలా లేదు. ఈ నేపథ్యంలో డిస్నీ హాట్ స్టార్స్ లో లక్ష్మీ బాంబ్ చిత్రం రిలీజ్ కానుంది. లక్ష్మీ బాంబ్ తెలుగు సినిమా కాంచన‌కు రీమేక్‌గా వస్తోంది. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ డీల్‌ ఖరీదు సుమారు వందకోట్లకు పైమాటే. సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారా కూడా ఓటీటీలో ఈ నెల 24న విడుదలకానుంది.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Ravi Teja, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు