హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja: ఫిబ్రవరిలో మరోసారి థియేటర్స్‌లో పలకరించనున్న రవితేజ..

Ravi Teja: ఫిబ్రవరిలో మరోసారి థియేటర్స్‌లో పలకరించనున్న రవితేజ..

11. క్రాక్:
ప్రసారమైన ఛానెల్: స్టార్ మా, రేటింగ్: 7.5

11. క్రాక్: ప్రసారమైన ఛానెల్: స్టార్ మా, రేటింగ్: 7.5

Ravi Teja: మాస్ మహారాజ్  రవితేజ హీరోగా సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదలైన  క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కుమ్మేసింది.తాజాగా ఈ సినిమాను వేరే భాషల్లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.

  Ravi Teja: మాస్ మహారాజ్  రవితేజ హీరోగా సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో విడుదలైన  క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కుమ్మేసింది. రాజా ది గ్రేట్ తర్వాత సరైన హిట్ లేని రవితేజకు క్రాక్ మూవీ మరోసారి ఊపిరి పోసింది. ఈ చిత్రంతో చాలా ఏళ్ళ తర్వాత బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాడు మాస్ రాజా. సంక్రాంతి సీజన్‌లో పర్ఫెక్ట్ మాస్ సినిమా వస్తే కలెక్షన్స్ ఎలా వస్తాయో ఈ సినిమా నిరూపిస్తుంది. క్రాక్ వచ్చిన రోజు నుంచి కలెక్షన్స్ కిరాక్ పుట్టిస్తుంది. ప్యాండమిక్ కారణంగా 50 శాతం ఆక్యుపెన్సీతోనే ఓపెన్ అయిన క్రాక్ రెండో రోజే 6.25 కోట్ల షేర్.. 10 కోట్లకు పైగా గ్రాస్ (తొలి రోజు నైట్ షోస్ మాత్రమే పడ్డాయి) వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఆ తర్వాత కూడా వరసగా దూకుడు చూపిస్తూనే ఉన్నాడు మాస్ రాజా. ఇప్పటి వరకు 15 రోజుల్లో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 33 కోట్ల షేర్ వసూలు చేసింది. కరోనా టైమ్ కదా కాస్త తక్కువగా వస్తాయేమో వసూళ్లు అనుకుంటే.. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ట్రేడ్‌కు కూడా షాక్ ఇస్తూ మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది.

  పండగ సీజన్ కావడం.. పాజిటివ్ టాక్ రావడంతో పిచ్చెక్కిస్తున్నాడు రవితేజ. కిరాక్ మాస్ పర్ఫార్మెన్స్‌తో క్రాక్ రేపుతున్నాడు. వింటేజ్ రవితేజ ఈజ్ బ్యాక్ అంటూ పండగ చేసుకుంటున్నారు ఆయన డై హార్డ్ ఫ్యాన్స్. డాన్ శీను, బలుపు సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని ఈ సినిమాతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు. ముందు నుంచి చెప్తున్నట్లుగానే రవితేజతో తన స్టామినా చూపించాడు గోపీచంద్. ఈ సినిమాకు రామ్ లక్ష్మణ్ డిజైన్ చేసిన ఫైట్స్ కూడా కారణమే. ఇప్పటి వరకు 15 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 33 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి రవితేజ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఈ సినిమా థియేటర్స్‌లో నడుస్తూ ఉండగానే ఆహా ఓటీటీలో విడుదల చేసారు.

  ఫిబ్రవరి 5న క్రాక్ తమిళం, మలయాళం వెర్షన్స్ థియేటర్స్‌లో విడుదల(Twitter/Photo)

  ఆ సంగతి పక్కన పెడితే.. క్రాక్ సినిమాను తాజాగా తమిళం, మలయాళ ప్రేక్షకుల కోసం ఆయా డబ్ చేసారు. అంతేకాదు ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు.

  క్రాక్ అనేది యూనివర్సల్ టైటిల్ కాబట్టి ఈ సినిమాను ఆయా భాషల్లో అదే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇక హిందీలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. త్వరలో ఈ రీమేక్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలబడే అవకాశం ఉంది.  మొత్తంగా తెలుగులో క్రాక్ పుట్టించినట్టే.. ఆయా భాషల్లో కూడా క్రాక్ మూవీ నిజంగానే క్రాక్ పుట్టించే కలెక్షన్స్ తెప్పిస్తుందా లేదా అనేది చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Krack, Malliwood News, Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు