Ravi Teja Krack: సంక్రాంతి బరిలో రవితేజ క్రాక్.. డేట్ లాక్ చేసిన మాస్ మహారాజ్..

Mass Maharaja Raviteja Krack movie rejected by a star hero first

Ravi Teja Krack Movie Release Date Lock | మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్‌. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ సినిమా ఇది. తాజాగా ఈ సినిమా విడుదల తేదిని చిత్ర యూనిట్ ఖరారు చేసింది.

  • Share this:
    Ravi Teja Krack Movie Release Date Lock |మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం క్రాక్‌. డాన్‌ శీను, బ‌లుపు లాంటి సినిమాల తర్వాత మరోసారి ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హాట్రిక్ సినిమా ఇది. దాంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. వరస ఫ్లాపులతో ఉన్న రవితేజ కెరీర్‌కు ఈ చిత్రం డూ ఆర్ డై గా మారిపోయింది. అప్పట్లో వరస డిజాస్టర్స్‌తో పూర్తిగా ఇమేజ్ పడిపోతున్న సమయంలో రవితేజతో బలుపు సినిమా చేసి హిట్ ఇచ్చాడు గోపీచంద్ మలినేని. మరోసారి ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు రవితేజ. దాంతో ఇప్పుడు కూడా ఇదే చేస్తాడని నమ్ముతున్నారు రవితేజ అభిమానులు.

    ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను తమిళ సినిమా విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘సేతుపతి’ ఆధారంగా తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. టీజర్ షాట్స్ చూసిన తర్వాత కూడా ఇదే అనిపిస్తుంది. విజయ్ సేతుపతి హీరోగా మూడేళ్ల కింద వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. తెలుగులో దీన్ని జయంత్ సి పరాన్జీ జయదేవ్ పేరుతో రీమేక్ చేసాడు. మళ్లీ ఇప్పుడు మరోసారి ఇలాంటి కథతోనే రవితేజ క్రాక్ సినిమా వస్తుందని ప్రచారం జరుగుతుంది.


    ఎపుడో షూటింగ్ కంప్లీటైన ఈ చిత్రానికి ఓటీటీలో భారీ ఆఫర్ వచ్చినా.. నిర్మాతలతో పాటు రవితేజ ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేసారు. తాజాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా వచ్చే యేడాది జనవరి 14న విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్ తర్వాత ఇపుడిపుడే థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల మల్టీప్లెక్స్‌లు తెరుచుకున్నాయి. దీంతో హీరోలు, నిర్మాతలు ఒక్కొక్కరుగా తమ సినిమాలను రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ కోవలో ముందుగా క్రాక్ సినిమాను జనవరి 14న థియేటర్స్‌లో సందడి చేయనుంది. మరి క్రాక్ మూవీతోనైనా రవితేజ హిట్టు ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: