హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja Krack: ‘క్రాక్’ సినిమాకు అనుకోని షాక్.. అక్కడ మాత్రం రవితేజ సినిమాకు భారీ నిరాశ..

Ravi Teja Krack: ‘క్రాక్’ సినిమాకు అనుకోని షాక్.. అక్కడ మాత్రం రవితేజ సినిమాకు భారీ నిరాశ..

రవితేజ Photo : Twitter

రవితేజ Photo : Twitter

Ravi Taja Krack | ఈ యేడాది సంక్రాంతి కానుకగా  విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది క్రాక్. తాజాగా ఈ సినిమాకు అనుకోని షాక్ తగిలింది.

  Ravi Teja Krack | ఈ యేడాది సంక్రాంతి కానుకగా  విడుదలైన సినిమాల్లో సంచలన విజయం సాధించింది క్రాక్. రవితేజకు దాదాపు నాలుగేళ్ళ తర్వాత అసలు సిసలు విజయం ఈ సినిమాతో దక్కింది. ఇక హీరోగా  పని అయిపోయింది.. రవితేజ సైడ్ కారెక్టర్స్ వేసుకోవాల్సిందే అంటూ సెటైర్లు వేసిన వాళ్లకు ‘క్రాక్’ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు. రవితేజ బాక్సాఫీస్  దెబ్బకు ఏకంగా సంక్రాంతికి థియేటర్‌లు మోతెక్కిపోయాయి. అంత అద్భుతంగా వసూళ్లు సాదిస్తున్న సినిమాను మూడు వారాలకే ఆహాలో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దాంతో థియేటర్స్‌లో ఎక్కడ ఆపాడో.. అక్కడ్నుంచే ఆహాలో మొదలుపెట్టాడు పోతరాజు వీరశంకర్. ఆహాలో ఈ సినిమాకు మంచి వ్యూస్ దక్కినట్టు ప్రకటించారు.

  తాజాగా ఈ సినిమా స్టార్ మా ప్రసారమైంది. మొదటిసారి వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌లో ఈ సినిమాలో ప్రసారం చేస్తే ఈ సినిమాకు ప్రేక్షకులు అనుకోని షాక్ ఇచ్చారు.ఈ సినిమాకు 11.7 టీఆర్పీ వచ్చింది. ఒక సూపర్ హిట్ చిత్రానికి మొదటిసారి ప్రసారమైనపుడు మినిమం 20 టీఆర్పీ వస్తుందనుకుంటే.. అందుకు భిన్నంగా ఈ సినిమా ఫస్ట్ ప్రీమియర్‌కు అనుకుకున్నంత రెస్పాన్స్ దక్కలేదు.

  ఈ సినిమాకు తక్కువ టీఆర్పీ రేటు రావడానికి కారణాలు కూడా  చెబుతున్నారు. ఇప్పటికే సంక్రాంతికి ఈ సినిమాను చాలా మంది థియేటర్స్‌లో చూసారు. మరోవైపు మూడు వారాల్లో ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో చూసేసారు మెజారిటీ ప్రేక్షకులు. దీంతో ఈ సినిమా మొదటి టెలివిజన్ ప్రీమియర్‌కు తక్కువ టీఆర్పీ వచ్చి వుంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం రవితేజ.. రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేస్తున్నట్టు సమాచారం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Gopichand malineni, Krack, Ravi Teja, Tollywood

  ఉత్తమ కథలు