Krack movie review: రవితేజ ‘క్రాక్’ రివ్యూ.. ష్యూర్ షాట్.. నో డౌట్.. బాక్సాఫీస్ బద్ధలైపోద్ది..

రవితేజ క్రాక్ సినిమా (Ravi Teja Krack)

Krack movie review: సంక్రాంతి సీజన్ క్రాక్ సినిమాతో మొదలైంది. డిస్కో రాజా లాంటి ఫ్లాప్ తర్వాత రవితేజ నటించిన సినిమా కావడం.. వరస ఫ్లాపులు ఉండటంతో మాస్ రాజాకు క్రాక్ హిట్ కీలకంగా మారింది. పైగా సంక్రాంతి సీజన్‌లో.. కరోనా వైరస్‌ను దాటుకుని ఈ చిత్రం విడుదలైంది. మరి క్రాక్ సినిమా అంచనాలు అందుకుందా.. మాస్ రాజా కోరుకున్న విజయం అందించిందా.. రవితేజతో గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ కొట్టాడా లేదా..?

  • Share this:
రివ్యూ: క్రాక్
నటీనటులు: రవితేజ, శృతి హాసన్, సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్, సుధాకర్, వంశీ, దేవీ ప్రసాద్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జికే విష్ణు
సంగీతం: థమన్
ఎడిటర్: న‌వీన్ నూలి
మాటలు: సాయి మాధవ్ బుర్రా
నిర్మాత: ఠాగూర్ మధు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: గోపీచంద్ మలినేని

సంక్రాంతి సీజన్ క్రాక్ సినిమాతో మొదలైంది. డిస్కో రాజా లాంటి ఫ్లాప్ తర్వాత రవితేజ నటించిన సినిమా కావడం.. వరస ఫ్లాపులు ఉండటంతో మాస్ రాజాకు క్రాక్ హిట్ కీలకంగా మారింది. పైగా సంక్రాంతి సీజన్‌లో.. కరోనా వైరస్‌ను దాటుకుని ఈ చిత్రం విడుదలైంది. మరి క్రాక్ సినిమా అంచనాలు అందుకుందా.. మాస్ రాజా కోరుకున్న విజయం అందించిందా.. రవితేజతో గోపీచంద్ మలినేని హ్యాట్రిక్ కొట్టాడా లేదా..?

కథ:
పోతరాజు వీరశంకర్ (రవితేజ) పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. దానికితోడు కాస్త క్రాక్ ఉన్నోడు. అడ్డొస్తే ఎవర్నైనా తన్ని మూలకు కూర్చోబెట్టేస్తాడు. బ్యాగ్రౌండ్ అనే పదం వినిపిస్తే చాలు బంతాటాడేస్తుంటాడు. ఆయనకు భార్య కళ్యాణి (శృతి హాసన్), కొడుకు ఉంటారు. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. మరోవైపు డ్యూటీ కూడా సిన్సియర్‌గా చేస్తుంటాడు. అలాంటి క్రాక్ పోలీస్ జీవితంలోకి ముగ్గురు విలన్స్ వస్తారు. అందులో కఠారి కృష్ణ (సముద్ర ఖని) కీలకం. ఒంగోలులో నెత్తురు పారించే కఠారి కృష్ణను తన స్టేషన్‌లో పని చేసే కానిస్టేబుల్ కిరణ్ (సుధాకర్) హత్య కేసులో అరెస్ట్ చేస్తాడు సిఐ శంకర్. అక్కడ్నుంచి అసలు కథ మొదలవుతుంది. కృష్ణ కంటే ముందే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ సలీమ్‌ను కూడా శంకర్ అరెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత కడప రౌడీ కొండారెడ్డి (రవిశంకర్) కూడా శంకర్‌తో పెట్టుకుంటాడు. ఈ ముగ్గురి విలన్స్ ఆట ఎలా కట్టించాడు అనేది క్రాక్ కథ..

కథనం:
కథ పరంగా చూసుకుంటే క్రాక్ ఎన్నోసార్లు చూసిందే. ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఊళ్ళోకి వచ్చి అక్కడున్న రౌడీల ఆట కట్టిస్తాడు. చాలా సినిమాల్లో ఇదే చూసాం. కానీ క్రాక్ ట్రీట్మెంట్ చాలా వెరైటీగా ఉంది. దాన్ని అలా డిజైన్ చేసాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. రొటీన్ స్టోరీ రాసుకున్నా కూడా స్క్రీన్ ప్లే మాత్రం అదరగొట్టాడు. మాస్ ఆడియన్స్‌కు కావాల్సిన విందు ఇందులో ముందుంచాడు. అయినా కూడా ఏమాట కామాటే.. ఎలాంటి సినిమాలు చూసినా.. పక్కా మాస్ బొమ్మ చూస్తే వచ్చే కిక్కే వేరు. అసలే సంక్రాంతి సీజన్.. పైగా 10 నెలల గ్యాప్.. ఆకలి మీద ఉన్న వాళ్లకు మాస్ భోజనం పెట్టేసాడు రవితేజ. థియేటర్స్‌లో తన ఎనర్జీతో క్రాక్ పుట్టించాడు. తనదైన మాస్ పర్ఫార్మెన్స్‌తో పిచ్చెక్కించాడు మాస్ రాజా. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా అయినా కూడా మసాలాలు అన్నీ బాగా దట్టించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. దాంతో సంక్రాంతి విందు భోజనంలో ఏవేవి ఎంత పడాలో క్రాక్‌లో అన్నీ సమపాళ్ళలో పడ్డాయి. విక్రమార్కుడు తర్వాత అంత సీరియస్ రోల్ ఈ చిత్రంలోనే చేసాడు రవితేజ. మరోవైపు మూడు కథలు.. ముగ్గురు విలన్స్.. ఓ పోలీస్ ఆఫీసర్ ఆడుకున్న ఆటను భలే కలిపాడు గోపీచంద్. ఆయన స్క్రీన్ ప్లేనే సినిమాకు బలం.. విలన్స్‌ను ఆడుకునే పోలీస్ కథలు చాలానే వచ్చినా క్రాక్ మాత్రం కాస్త స్పెషల్. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో పరుగులు పెట్టించాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.
ఫస్టాఫ్, సెకండాఫ్ అని తేడా లేకుండా రెండూ పర్ఫెక్టుగా బ్యాలెన్స్ చేసాడు. ముఖ్యంగా తొలి 15 నిమిషాల్లోనే రవితేజ కారెక్టర్ అంతా రివీల్ చేసాడు. అక్కడ్నుంచి బిల్డప్ షాట్స్‌తో నింపేసాడు. చాలా ఏళ్ళ తర్వాత తన నుంచి మాస్ ఆడియన్స్‌కు కావాల్సింది ఇచ్చేసాడు రవితేజ. రవితేజ ఎనర్జీతో సింపుల్ స్టోరీ కూడా కిరాక్ పుట్టించింది.. పోలీస్ ఆఫీసర్‌గా చింపేసాడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో సముద్రఖనిని అరెస్ట్ చేసే సీన్ బాగా డిజైన్ చేసాడు దర్శకుడు. ఆ తర్వాత కూడా రవితేజతో సముద్రఖని వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ఫైట్ సీక్వెన్సులు అయితే పిచ్చెక్చించారు. క్రాక్ సినిమాలో ప్రధాన బలం అవే. చిన్నచిన్న సీన్స్ ఇంటర్ లింక్ చేస్తూ స్క్రీన్ ప్లే చక్కగా అల్లుకున్నాడు గోపీచంద్. ఫస్టాఫ్‌లో టెర్రరిస్ట్ దగ్గర్నుంచి కథ మొదలు పెట్టి.. సుమద్రఖని, రవిశంకర్ సీన్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు గోపీచంద్. క్లైమాక్స్ వరకు కూడా ఎంగేజింగ్ సీన్స్ అల్లాడు. మధ్యలో ఒంగోల్ బస్టాండ్‌లో వచ్చే ఫైట్ సీక్వెన్స్.. క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ అదిరిపోయాయి.

నటీనటులు:
రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా రప్ఫాడించాడు. విక్రమార్కుడు తర్వాత ఆ స్థాయిలో రప్ఫాడించిన రోల్ ఇదే. పోతరాజు వీరశంకర్ స్క్రీన్‌పై వీరంగం ఆడేసాడంతే. శృతి హాసన్ కూడా బాగానే చేసింది. సెకండాఫ్‌లో ఈమెపై వచ్చే ఫైట్ సీక్వెన్స్ కూడా అదిరిపోయింది. సముద్రఖని, వరలక్ష్మి ఆకట్టుకున్నారు. ఉన్నది కాసేపు అయినా కూడా సుధాకర్, వంశీ కూడా బాగానే నటించారు. రవిశంకర్ విలనిజం కూడా బాగుంది.

టెక్నికల్ టీం:
క్రాక్‌కు ప్రధాన బలం ఫైట్స్.. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సినిమా రేంజ్ పెంచేసారు. వాళ్లు డిజైన్ చేసిన ఫైట్ సీక్వెన్సులు చూస్తుంటే వారెవ్వా అనిపించక మానదు. ఆ తర్వాత థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదుర్స్. తన ఆర్ఆర్‌తో సీన్స్ రేంజ్ పెంచేసాడు. జికే విష్ణు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నవీన్ నూలి ఎడిటింగ్ పర్లేదు. నిర్మాతగా ఠాగూర్ మధు అత్యున్యతంగా నిర్మించాడు. సాయి మాధవ్ బుర్రా మాటలు కూడా బాగున్నాయి. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని మాస్ మసాలా కథను సిద్ధం చేసుకుని దానికి తగ్గట్లు స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. రవితేజతో హ్యాట్రిక్ పూర్తి చేసాడు.

చివరగా ఒక్కమాట:
క్రాక్.. ష్యూర్ షాట్.. నో డౌట్.. బాక్సాఫీస్ బద్ధలైపోద్ది..

రేటింగ్: 3.25/5
Published by:Praveen Kumar Vadla
First published: