Krack crowd at Theatres: ‘క్రాక్’ రిలీజ్ సందడి.. థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్ ఉరుకులు పరుగులు..

రవితేజ క్రాక్ సినిమా (Ravi Teja Krack)

Krack crowd at Theatres: కాస్త ఆలస్యంగా క్రాక్ వచ్చేసింది. కొన్నిసార్లు ఆలస్యం కూడా బాగానే ఉంటుందంటూ రవితేజ కూడా ట్వీట్ చేసాడు. తన సినిమా కోసం అంతగా వేచి చూసిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు మాస్ రాజా.

  • Share this:
కాస్త ఆలస్యంగా క్రాక్ వచ్చేసింది. కొన్నిసార్లు ఆలస్యం కూడా బాగానే ఉంటుందంటూ రవితేజ కూడా ట్వీట్ చేసాడు. తన సినిమా కోసం అంతగా వేచి చూసిన అభిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపాడు మాస్ రాజా. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్‌లో క్రాక్ విడుదలైంది. ఉదయం షోలు కాకుండా రాత్రి నుంచి షోలు మొదలైపోయాయి. ఫస్ట్ షో నుంచి వస్తుందని అనుకున్నా కూడా కాస్త ఆలస్యంగా సెకండ్ షో నుంచి క్రాక్ పుట్టించడం మొదలు పెట్టాడు రవితేజ. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ చిత్రం విడుదల కాలేదు. జనవరి 9న గ్రాండ్ రిలీజ్ అంటూ నానా హంగామా చేసిన తర్వాత థియేటర్స్ దగ్గరికి వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది క్రాక్. విడుదల కావడం లేదని తెలుసుకున్న ఫ్యాన్స్ అంతా షాక్ అయిపోయారు. అయ్యో.. చాలా రోజుల తర్వాత రవితేజ సినిమాను చూడాలని వస్తే ఏంటి ఈ సమస్య అంటూ నిరాశగా వెనుదిరిగారు. ఇదిలా ఉంటే ఉదయం నుంచి చేసిన చర్చలకు ఫలితం వచ్చింది. జనవరి 9 సాయంత్రం సెకండ్ షోల నుంచి క్రాక్ థియేటర్స్‌లోకి వచ్చింది.

బొమ్మ పడింది అంటూ దర్శకుడు ట్వీట్ చేసేసరికి పండగ చేసుకుంటున్నారు అభిమానులు. డాన్ శీను, బలుపు లాంటి సినిమాల తర్వాత గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి.

హైదరాబాద్ సంధ్య సహా మిగిలిన థియేటర్స్ దగ్గర రవితేజ అభిమానుల కోలాహలం కనిపిస్తుంది. థియేటర్స్‌ గేట్స్ ఓపెన్ చేయగానే లోపలకి పరుగులు తీసుకుంటూ వెళ్తున్నారు అభిమానులు. దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్‌లో దర్శనమిస్తున్నాయి.
Published by:Praveen Kumar Vadla
First published: