Ravi Teja Krack release: బ్రేకింగ్.. రవితేజ ఫ్యాన్స్‌కు షాక్.. ‘క్రాక్’ సినిమా విడుదల వాయిదా..

రవితేజ క్రాక్ సినిమా (Ravi Teja Krack)

Ravi Teja Krack release: సంక్రాంతి పండగ వచ్చింది.. హాయిగా సినిమా చూద్దాం అని థియేటర్ వైపు వెళ్లిన ఆడియన్స్‌కు నిరాశే ఎదురైంది. మాస్ రాజా రవితేజ సినిమాను థియేటర్స్‌లో గోల చేస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న వాళ్లు దారుణంగా మోసపోయారు.

  • Share this:
సంక్రాంతి పండగ వచ్చింది.. హాయిగా సినిమా చూద్దాం అని థియేటర్ వైపు వెళ్లిన ఆడియన్స్‌కు నిరాశే ఎదురైంది. మాస్ రాజా రవితేజ సినిమాను థియేటర్స్‌లో గోల చేస్తూ ఎంజాయ్ చేద్దామనుకున్న వాళ్లు దారుణంగా మోసపోయారు. క్రాక్ సినిమా విడుదలపై ముందు నుంచి కూడా గందరగోళం నడుస్తూనే ఉంది. ఇప్పుడు ఇదే నిజమైంది. సినిమా జనవరి 9న విడుదల కావడం లేదంటూ తాజాగా న్యూస్ బయటికి వచ్చింది. తెలుగు రాష్ట్రాలు రెండూ క్రాక్ విడుదల కోసం చూస్తున్న తరుణంలో షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. నిర్మాత ఠగూర్ మధుకు ముందు సినిమాల నుంచి వస్తున్న ఆర్థిక ఇబ్బందుల కారణంగా క్రాక్ విడుదలపై ప్రభావం పడింది. జనవరి 9 ఉదయం షోలు క్యాన్సిల్ కావడంతో నిరాశగా థియేటర్స్ నుంచి వెనుదిరిగారు ఫ్యాన్స్. కనీసం మ్యాట్నీస్ నుంచి అయినా సినిమాను ఎంజాయ్ చేద్దామనుకున్న రవితేజ అభిమానులకు పూర్తిగా నిరాశ ఎదురైంది. సినిమా అసలు జనవరి 9న విడుదల కావడం లేదంటూ చావు కబురు చల్లగా చెప్పారు. దాంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా నిరాశలో మునిగిపోయారు.
ravi teja krack movie,ravi teja krack movie review,ravi teja krack movie public talk,ravi teja krack movie shows cancel,ravi teja krack movie collections,ravi teja krack movie gopichand malineni,telugu cinema,ravi teja krack movie release postponed,రవితేజ క్రాక్,క్రాక్ సినిమా విడుదల వాయిదా,క్రాక్ సినిమా రివ్యూ
రవితేజ క్రాక్ సినిమా (Ravi Teja Krack)

పండగను రవితేజ మాస్ మసాలాతో మొదలు పెడదాం అనుకుంటే మరోటి అయిపోయింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. శృతి హాసన్ హీరోయిన్ కావడం.. బలుపు కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో మంచి అంచనాలతోనే థియేటర్స్ వైపు వచ్చింది క్రాక్. కానీ ఏం చేస్తాం.. అనుకున్నదొక్కటి అయినదొక్కటి అయిపోయింది క్రాక్ విషయంలో. ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ చేసి జనవరి 9 సాయంత్రానికి విడుదల చేయాలని చూస్తున్నా కూడా ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సినిమా అసలు విడుదల వాయిదా పడిందని తెలుస్తుంది. సరస్వతి ఫిలిం డివిజన్ పతాకంపై బి. మధు ఈ చిత్రాన్ని నిర్మించాడు. మరి చూడాలిక.. క్రాక్ ఎప్పుడు విడుదల కానుందో..?
Published by:Praveen Kumar Vadla
First published: