హోమ్ /వార్తలు /సినిమా /

Ravi Teja Krack: రవితేజ ‘క్రాక్’ ఓటిటి విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడొస్తుందో తెలుసా..?

Ravi Teja Krack: రవితేజ ‘క్రాక్’ ఓటిటి విడుదల తేదీ ఖరారు.. ఎప్పుడొస్తుందో తెలుసా..?

రవితేజ క్రాక్ సినిమా (Ravi Teja Krack)

రవితేజ క్రాక్ సినిమా (Ravi Teja Krack)

Ravi Teja Krack: ఒకటి రెండు కాదు నాలుగేళ్ళ తర్వాత రవితేజ మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఈయన నటించిన క్రాక్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది. 6 రోజుల్లో ఇప్పటి వరకు 20 కోట్ల వరకు షేర్ వసూలు చేసి హిట్ ట్రాక్ ఎక్కింది.

ఇంకా చదవండి ...

ఒకటి రెండు కాదు నాలుగేళ్ళ తర్వాత రవితేజ మళ్లీ ట్రాక్ ఎక్కాడు. ఈయన నటించిన క్రాక్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది. 6 రోజుల్లో ఇప్పటి వరకు 20 కోట్ల వరకు షేర్ వసూలు చేసి హిట్ ట్రాక్ ఎక్కింది. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజకు వచ్చిన విజయం ఇదే. కరోనా కారణంగా 50 ఆక్యుపెన్సీ ఉంది కాబట్టి వసూళ్లు ఇలా ఉన్నాయి కానీ అదే 100 శాతం ఉండుంటే కచ్చితంగా 30 కోట్ల షేర్ దాటిపోయేది. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యుండేది. ఇప్పటికీ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. రోజుకు కనీసం 2 కోట్ల వరకు షేర్ తీసుకొస్తుంది క్రాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు క్రాక్ ఓటిటి విడుదల తేదీ ఇదే అంటూ అభిమానులను కంగారు పెట్టే న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. కరోనా కారణంగా ఇప్పుడు దర్శక నిర్మాతలు సినిమా విడుదల తేదీతో పాటు ఓటిటి రిలీజ్ డేట్ కూడా ముందుగానే నిర్ణయించుకుంటున్నారు. కలెక్షన్స్ కానీ లేకపోతే ఒకట్రెండు వారాల్లోనే సినిమా ఒరిజినల్ ప్రింట్ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సాయి ధరమ్ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా థియేటర్స్‌లో విడుదలైన వారం రోజుల తర్వాత ఓటిటిలో విడుదల చేసారు. జనవరి 1న న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమాను జీ స్టూడియోస్ విడుదల చేసింది.

ravi teja krack movie,ravi teja krack movie ott release,krack movie collections,krack movie Aha ott release,krack movie 6 days collections,krack movie box office collection,ravi teja krack,krack movie collection,క్రాక్,క్రాక్ కలెక్షన్స్,రవితేజ క్రాక్ 6 డేస్ కలెక్షన్స్,రవితేజ క్రాక్ ఓటిటి విడుదల తేదీ
రవితేజ క్రాక్ (Ravi Teja Krack)

ఇప్పుడు రవితేజ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుందని ప్రచారం జరుగుతుంది. అయితే మరీ ఒక్క వారం కాదు మూడు వారాల తర్వాత క్రాక్ ఓటిటిలో విడుదల అవుతుందని తెలుస్తుంది. మంచి వసూళ్లతో దూసుకుపోతుండటంతో మరో రెండు వారాల తర్వాత ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమాను రవితేజ పుట్టిన రోజు కానుకగా జనవరి 26న ఓటిటిలో విడుదల చేయాలని చూస్తున్నారు.

ravi teja krack movie,ravi teja krack movie ott release,krack movie collections,krack movie Aha ott release,krack movie 6 days collections,krack movie box office collection,ravi teja krack,krack movie collection,క్రాక్,క్రాక్ కలెక్షన్స్,రవితేజ క్రాక్ 6 డేస్ కలెక్షన్స్,రవితేజ క్రాక్ ఓటిటి విడుదల తేదీ
రవితేజ క్రాక్ కలెక్షన్స్ (Ravi Teja Krack)

అల్లు అరవింద్ ఆహా సంస్థ క్రాక్ సినిమాను భారీ రేట్ పెట్టి సొంతం చేసుకున్నారు. దాదాపు 8 కోట్లకు ఈ సినిమా రైట్స్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. థియెట్రికల్ కలెక్షన్స్ డ్రాప్ అయిన తర్వాత క్రాక్ ఓటిటి విడుదల చేయనున్నారు. ఏదేమైనా కూడా మరీ ఇంత త్వరగా క్రాక్ వస్తుందని తెలియక షాక్ అవుతున్నారు రవితేజ అభిమానులు.

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Krack, Ravi Teja, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు