Ravi Teja: రవితేజ బ్యాక్ విత్ ఏ బ్యాంగ్.. కిరాక్ పుట్టిస్తున్న క్రాక్..

రవితేజ క్రాక్ పోస్టర్ (Ravi Teja Krack poster)

Ravi Teja: ఇది కదా ఇన్నాళ్లూ మీ నుంచి మేం కోరుకున్న సినిమా.. మధ్యలో అనవసరంగా ఏవేవో చేసారు కదా రవితేజ గారూ.. ఇప్పుడు ఇదే అంటున్నారు క్రాక్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్. రొటీన్ కమర్షియల్ సినిమా చేసినా కూడా అదిరిపోయే..

  • Share this:
ఇది కదా ఇన్నాళ్లూ మీ నుంచి మేం కోరుకున్న సినిమా.. మధ్యలో అనవసరంగా ఏవేవో చేసారు కదా రవితేజ గారూ.. ఇప్పుడు ఇదే అంటున్నారు క్రాక్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్. రొటీన్ కమర్షియల్ సినిమా చేసినా కూడా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులతో పిచ్చెక్కించాడు మాస్ రాజా. ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ ఫైట్ సీక్వెన్సులు సినిమాను మరో స్థాయికి చేర్చేసాయి. గోపీచంద్ మలినేని డైరెక్షన్.. శృతి హాసన్ గ్లామర్ షో వెరసి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. అన్నిచోట్లా కూడా హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమా విడుదలైనా కూడా ప్రతీ థియేటర్ ముందు హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రవితేజ సినిమాలకు కనీసం ఓపెనింగ్స్ కూడా రావడం లేదు. నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలకు కనీసం 10 కోట్ల షేర్ కూడా రాలేదు. ఇలాంటి సమయంలో రవితేజ సినిమా వస్తే తొలిరోజు హౌజ్ ఫుల్ బోర్డులు కనిపించడం మానేసి చాలా రోజులు అయిపోయింది. అలాంటి సమయంలో సంక్రాంతికి వచ్చి సందడి చేస్తున్నాడు ఈయన.
krack movie,krack movie review,krack movie public talk,krack movie collections,krack movie ravi teja collections,krack movie positive talk,క్రాక్,క్రాక్ రవితేజ,రవితేజ క్రాక్ కలెక్షన్స్
రవితేజ క్రాక్ పోస్టర్ (Ravi Teja Krack poster)

తొలిరోజు షోలు కాస్త ఆలస్యంగా పడినా కూడా రచ్చ చేస్తున్నాడు. రాత్రి షోలు మాత్రమే పడినా అన్నిచోట్లా హౌజ్ ఫుల్ కనిపిస్తున్నాయి. రెండో రోజు కూడా గ్రాండ్ ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది ఈ చిత్రం. కచ్చితంగా రవితేజ కోరుకుంటున్న విజయం క్రాక్‌తో వచ్చేసిందనే విషయం అర్థమైపోతుంది. ఏదేమైనా కూడా బ్యాక్ విత్ ఏ బ్యాంగ్ అంటారు కదా.. అలాంటి విక్టరీతోనే ఇప్పుడు తనను తాను నిరూపించుకున్నాడు రవితేజ.
Published by:Praveen Kumar Vadla
First published: